Cipla యొక్క 75వ సంవత్సరం పూర్తయిన సందర్భంలో Cipla
బ్రీత్‌ఫ్రీ అనబడే సార్వజనీయ సేవను అందించడాన్ని ప్రారంభించింది. ఇది ఆస్త్‌మాతో బాధపడుతున్న వారి కోసం లేదా మీకు కావలసిన వారి కోసం సృష్టించబడినది. రెస్పిరేటరీ వ్యాధుల పోరాటంలో పైచేయిగా ఉన్న ఫార్మా కంపెనీలలో మొదటిదైన Cipla, బ్రీత్‌ఫ్రీ స్థాపనకు సరైనది.
బ్రీత్‌ఫ్రీ ఎన్నో క్యాంప్‌లను మరియు ఇతర ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తుంది. వాటిలో బ్రీత్‌ఫ్రీ క్యాంప్‌లు, బ్రీత్‌ఫ్రీ క్లినిక్‌లు, బ్రీత్‌ఫ్రీ గురించి తెలియపరచే వస్తువులు మరియు మీరు ఇప్పుడే ఎంటర్ చేసిన breathefree.com వైబ్‌సైట్. ఎన్నో బ్రీత్‌ఫ్రీ ఆరంభాలు ఉన్నప్పటికీ, అవి అన్నీ ఒకే కారణం కోసం అంకితమయ్యాయి. భారతదేశంలోనే కాక మొత్తం ప్రపంచంలో ఉండే వారి ఆస్త్‌మాని నియంత్రించి ప్రజలకి సహాయం చేయడానికి. ఎందుకంటే వారు ఉద్యోగం చేయగలరు, వ్యాయామం చేయగలరు, వేడుకలు జరుపుకోగలరు, సెలవులలో ఆనందించగలరు… మరియు సంపూర్ణమైన మరియు చురుకైన జీవితాన్ని సాగించగలరు.
breathefree.comకి స్వాగతం (నిర్వహణ కింద_ బ్రీత్‌ఫ్రీ గురించి)
మీకు గాని మీ బిడ్డకి గాని ఆస్త్‌మా ఉందని తెలిస్తే, మీరు తెలుసుకోవలసినది ఏమిటంటే, మీరు కంగారు లేదా ఆందోళన పడవలసిన అవసరం లేదు.
వారి జీవన శైలిని మార్చకుండా, ఈ రోజులలో ఆస్త్‌మా ఉన్నవారు కూడా మామూలు జీవితాన్ని కొనసాగించవచ్చు.
ఈ ప్రపంచంలో 300 మిలియన్ల మంది ప్రజలకి మరియు భారతదేశంలోనే 30 మిలియన్ల మందికి ఆస్త్‌మా ఉంది. అందుకే మీరు ఒంటరిగా లేరు. ఎంతో మంది విజయం పొందిన వారికి కూడా ఆస్త్‌మా ఉంది. వారిలో కొంతమంది వ్యాపారవేత్తలు, సినిమా తారలు మరియు ఆటగాళ్ళు కూడా ఉన్నారు.వారి లాగే
మీరు కూడా మీ ఆస్త్‌మాని నియంత్రించి, సంపూర్ణమైన జీవితాన్ని గడపవచ్చు.
breathefree.com మీకు ఇది ఎలా సాధ్యమౌతుందో చూపిస్తుంది. ఇది ఆస్త్‌మాతో బాధ పడుతున్న వారికి జ్ఞానం మరియు మనోధైర్యాన్ని ఇచ్చి సంపూర్ణమైన జీవితాన్ని సాగించడానికి దోహదపడి
ఈ దీర్ఘకాల (సుదీర్ఘ కాలం ఉండే) వ్యాధిని నిర్వహించడానికి మరియు సహాయపడటానికి సృష్టించబడింది.
మీకు గాని లేదా మీ బిడ్డకి గాని మళ్ళీ మళ్ళీ వచ్చే లేదా దీర్ఘకాలపు దగ్గు, ఏదైనా అలర్జీలు, ఊపిరి పీల్చుకోడానికి ఇబ్బంది, విపరీతమైన కంజెషన్, ఛాతిలో ఇన్‌ఫెక్షన్ లేదా ఇతర ఊపిరి పీల్చుకోడానికి లేదా ఛాతికి సంబంధించినది ఏమైనా సమస్యలు ఉంటే, మీరు సరైన ప్రదేశానికే వచ్చారు.
breathefree.com లో మీరు ఆస్త్‌మా గురించి అన్ని విషయాలు కనుగొనవచ్చు. తమ ఆస్త్‌మాని అందరూ ఎలా నియంత్రించి, మామూలు జీవితాన్ని గడుపుతారో. మరియు ఆస్త్‌మా ఉండి కూడా మీరు జీవితాన్ని పూర్తిగా ఎలా అనుభవించగలరో.