|
ఆస్త్‌మాలో ట్రిగ్గర్స్ అంటే ఏమిటి?
ట్రిగ్గర్స్ అంటే మీ బిడ్డపై ఆస్త్‌మా దాడిని ప్రారంభించే లేదా ఆస్త్‌మాని మరింత ఎక్కువ చేసే విషయాలు.
ట్రిగ్గర్స్ ప్రతిచోటా ఉంటాయి. మీ ఇల్లు, స్కూలు, ఆట స్థలం అంతటా ట్రిగ్గర్స్ ఉండవచ్చు.
మీ బిడ్డకు కొన్ని సాధారణ ఆస్త్‌మా ట్రిగ్గర్స్:
 |
దుమ్ము మరియు
పొగ |
|
 |
| మొక్కల నుండి పూల పుప్పొడి |
|
 |
స్కూల్లో చాక్పీస్
దుమ్ము |
|
 |
వాతావరణంలో
మార్పు |
|
 |
| నవ్వడం మరియు ఏడవడం వంటి భావోద్వేగాలు |
|
 |
| బొచ్చు జంతువుల వెంట్రుకలు మరియు పక్షుల ఈకలు |
|
 |
| శారీరక శ్రమ మరియు వ్యాయామం |
|
|
మీ బిడ్డకు కేవలం ఒకే ట్రిగ్గర్ ఉండవచ్చు లేదా ట్రిగ్గర్స్‌గా పని చేసే చాలా విషయాలను మీరు కనుగొనవచ్చు. ఒకసారి మీ బిడ్డ ఆస్త్‌మాని ఏది ట్రిగ్గర్ చేస్తుందో మీరు తెలుసుకున్నాక, ఈ ట్రిగ్గర్స్‌ను నియంత్రించేందుకు చర్యలను తీసుకోవడం ముఖ్యం. మీ ఇంటి నుండి మీరు ట్రిగ్గర్స్‌ను తొలగించినప్పుడు లేదా వెలుపలి ట్రిగ్గర్స్ నుండి మీ బిడ్డను దూరంగా ఉంచినప్పుడు, మీ బిడ్డ ఆరోగ్యంగా మరియు స్వల్ప ఆస్త్‌మా దాడులకే గురయ్యేటట్లు మీరు సహాయం చేయవచ్చు. మీ బిడ్డ ఆస్త్‌మా ట్రిగ్గర్స్‌ను గుర్తించడానికి మీ డాక్టర్తో పని చేయండి.
| దయచేసి గమనించండి: ఇది అన్ని ట్రిగ్గర్స్ ఉండే జాబితా కాదు. మీ బిడ్డకు ఆస్త్‌మా ఉంటే, మీరు మీ బిడ్డ యొక్క ట్రిగ్గర్ను గమనించి, వాటిని దూరంగా ఉంచమని మీ బిడ్డకు చెప్పాలి. మీ బిడ్డ యొక్క ట్రిగ్గర్స్, లక్షణాలు మరియు చికిత్స గురించి మీకు ఏవైనా సందేహాలుంటే మీ డాక్టర్ను సంప్రదించండి. |
|
|
|