ఆస్త్‌మా నయం కాకపోయినప్పటికీ, శుభవార్త ఏమిటంటే దానిని నియంత్రించవచ్చు. ఆధునిక మందులు మరియు ఇన్‌హేలర్లు ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా సామాన్యమైన, ఆరోగ్యవంతమైన జీవితాలను కొనసాగించటానికి అనుకూలంగా చేసాయి. సరైన చికిత్స ద్వారా మీరు కూడా ఒక సంపూర్ణమైన జీవితాన్ని పొందవచ్చు.
ఆస్త్‌మాని నియంత్రించడానికి మీరు మొదట చేయవలసిన పని ఏమిటంటే మీరు మీ డాక్టర్‌ని సంప్రదించి మరియు ఏమి చేయాలో అర్ధం చేసుకోండి. ఉదాహరణకి, మీ డాక్టర్ మీకు
ట్రిగ్గర్స్ గురించి, మీ ఊపిరితిత్తులలో గాలి వెళ్ళే మార్గాలకు ఇబ్బంది కలిగించే వాటి గురించి సలహా ఇవ్వవచ్చు.
మీ ఆస్త్‌మాని నియంత్రించడానికి మీ డాక్టర్ కొన్ని మందులు ఇస్తారు కాని మీ చికిత్స నిజంగా ప్రభావం చూపించాలంటే ఆయనతో మీరు సహకరించాలి. మీ ఆస్త్‌మా అదుపులో ఉంచడానికి డాక్టర్ చెప్పిన విధంగా మీరు మీ మందులు వేసుకోవాలి.
అత్యవసర సమయంలో త్వరగా ఏమి చేయాలో కూడా మీ డాక్టర్ మీకు చెప్పవచ్చు.
మీరు పూర్తి సమాచారంతో మిమ్మల్ని మీరు మరింత బలపరుచుకోండి - ఏ ట్రిగ్గర్స్‌ను అధిగమించాలో, ఇతర మందులపై ఇన్‌హేలర్లకు ఉండే లాభాలు, ఎటాక్ వచ్చినప్పుడు చేయవలసినవి మరియు మీ ఆస్త్‌మాని నియంత్రణలో ఉంచుకునే మార్గాలు లాంటివి.
ఇన్‌హేలర్లు ఎందుకు మెరుగైనవి? |
మన ఆధునిక యుగానికి పరిమితం కాకుండా, మందులు ఇన్‌హేలర్లు ద్వారా తీసుకోవడంలో గల లాభం ప్రపంచానికి ఎప్పుడో అర్ధం అయ్యింది. 2000 వేల సంవత్సరాలు క్రితం, పురాతన ఈజిప్ట్, గ్రీస్ మరియు భారతదేశంలో ఆస్త్‌మా మరియు ఊపిరి ఆడనప్పుడు ఉపశమనం కలిగించడానికి ప్రజలు వైద్య సంబంధిత మూలికలు మరియు ఆకులను పీల్చడంలో ఉన్న లాభాలు తెలుసుకున్నారు. ఎన్నో వందల సంవత్సరాల తరువాత, ఇన్‌హేలర్లు అభివృద్ధి చెంది ఇప్పుడు ఎంతో అధునాతనమైన మరియు ప్రభావితమైనవిగా ఉన్నాయి.
ఆస్త్‌మా రోగులు ప్రపంచ వ్యాప్తంగా ఇన్‌హేలర్లు వాడుతున్నారు, అవి వారి దిన చర్యలు మామూలుగా కొనసాగించడానికి దోహదపడతాయి. ఆస్త్‌మా ఉన్నప్పుడు కూడా,
ఆస్త్‌మా ఇన్‌హేలర్లు ప్రజలకి సంపూర్ణమైన జీవితాలని కొనసాగించడానికి స్వతంత్రాన్ని ఇచ్చాయి.
ప్రపంచమంతటిలో, ఆస్త్‌మా ఇన్‌హేలర్లు టాబ్లెట్లు మరియు సిరప్‌లు వంటి ఇతర చికిత్సా విధానాలు కంటే మెరుగని నిరూపించబడినవి. ఎందుకు? మీకు మీ కన్నుతో సమస్య ఉన్నప్పుడు, మీరు మీ కంటిలో చుక్కలు వేసుకుంటారు. మీకు మీ చర్మంతో సమస్య ఉన్నప్పుడు మీరు మలాం లేదా క్రీం మీ చర్మం మీద రాసుకుంటారు. మీరు టాబ్లెట్ లేదా ఏదైనా సిరప్ మింగరు. మీరు ఎక్కడైతే అవసరమో అక్కడ సరిగ్గా మందు వేసుకుంటారు. అదే విధంగా, ఆస్త్‌మాని, మీరు మీ నోటిలో ఉంచుకున్న ఇన్‌హేలర్ ద్వారా మందుని లోపలికి పీల్చుకోవాలి.
ఇది ఎక్కువ ప్రభావం చూపుతుంది ఎందుకంటే మందు పీల్చుకున్నాక త్వరగా మరియు సరాసరి అవసరమైన చోటుకి చేరుతుంది, అంటే మీ ఊపిరితిత్తుల వాయు నాళాలు.
ఆస్త్‌మా కోసం టాబ్లెట్లు మరియు సిరప్‌లతో పోల్చి చూడండి. మీకు తెలిసినట్లే అవి తప్పక మింగాలి. కాని మీరు తెలుసుకోవలసింది ఏంటంటే టాబ్లెట్ లేదా సిరప్ పనిచేయడానికి కొంత సమయం పడుతుంది ఎందుకంటే అది జీర్ణకోశం నుండి రక్తానికి వెళ్ళి చివరిగా ఊపిరితిత్తులలోకి వెళ్తుంది. ఇది చాలా నెమ్మదిగా జరిగి రోగికి ఉపశమనం కలగడానికి ఎక్కువ సమయం పడుతుంది. కొంత మందు జీర్ణకోశంలో కూడా అనవసరంగా ఉండవచ్చు. దీని వలన ఎక్కువ
సైడ్ ఎఫెక్ట్‌లు ఉండవచ్చు.
అదేకాకుండా, టాబ్లెట్లు మరియు సిరప్‌ల విషయాని కొస్తే, అది అంతా ఊపిరితిత్తులకి చేరదు కాబట్టి ఎక్కువ మోతాదు కావలిసి ఉంటుంది. దీన్ని బట్టి అర్ధమయ్యేది ఏమిటంటే ఎక్కువ సైడ్ ఎఫెక్ట్‌లు ఉంటాయి.
మీరు మందులు ఇన్‌హేలర్ ద్వారా తీసుకున్నప్పుడు, మీ ఊపిరితిత్తులులోకి వెళ్ళే మోతాదు 40 సార్లు తక్కువ ఉంటుంది మరియు అది జీర్ణకోశంలోకి అస్సలు వెళ్ళదు, దాని వలన తక్కువ సైడ్ ఎఫెక్ట్‌లు ఉంటాయి. ముఖ్యంగా మీకు మీరు ప్రశ్నించు కోవలసినది: “నా ఊపిరితిత్తులుకి మాత్రమే అవసరం అయినప్పుడు నేను ఇతర అవయవాలకి వెళ్ళే మందు ఎందుకు తీసుకోవాలి?"
USA మరియు UK లాంటి అభివృద్ధి చెందిన దేశాలలో, ఆస్త్‌మా కోసం టాబ్లెట్లు మరియు సిరప్‌ల బదులుగా ఇన్‌హేలర్లు ప్రథమ చికిత్సకి వాడుతున్నారు. అది ప్రభావితమైనది మరియు
ఆస్త్‌మా నియంత్రణకు సురక్షితమైన మార్గం.
పూర్తి క్లినికల్ పరిశోధనలు మరియు ప్రసిద్ధికెక్కిన వైజ్ఞానిక మరియు వైద్య కళాశాలలు నిర్వహించిన పరిశోధన ద్వారా ఇన్‌హేలర్లు సురక్షితమని నిరూపించబడినవి. సైడ్ ఎఫెక్ట్‌లు, ఒకవేళ ఉన్నా, చాలా తక్కువ మరియు సులువుగా తగ్గించవచ్చు. ఒకవేళ మీకు ఏ మాత్రం ఇబ్బందనిపించినా లేదా ఏదైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటే మీ డాక్టర్‌కి తెలియపరచండి.
ఆస్త్‌మా ఇన్‌హేలర్లు
ఖరీదైనవి కాదు. కొద్ది రూపాయలకే మీకు ప్రతి రోజూ ఉపశమనం కలుగుతుంది. ఇన్‌హేలర్లు వాడుతున్న ఆస్త్‌మా రోగులు ఉద్యోగం చేసే చోట, పాఠశాలలో మరియు కాలేజీలలో క్రమం తప్పకుండా హాజరు అవుతారని పరిశోధనలు తెలుపుతున్నాయి.
కంట్రోలర్‌లు మరియు రిలీవర్‌లు అనబడే 2 రకాల మందులు ఇన్‌హేలర్లు ద్వారా తీసుకోవచ్చు. పీల్చగల మందులు గురించి మరింత సమాచారం కోసం ఇంకా చదవండి. మరియు మీ ఆస్త్‌మాకి సరైన చికిత్స కోసం మీ డాక్టర్‌ని సంప్రదించండి.
ఇన్‌హేలర్లలో ఉన్న రకరకాల ఆస్త్‌మా మందులు |
టాబ్లెట్లు, సిరప్‌లు మరియు ప్రత్యామ్నయ మందు కన్నా కూడా ఇన్‌హేలర్లు ఆస్త్‌మా నియంత్రణకు సురక్షితమని మరియు ఎక్కువ ప్రభావంతమైనవని నిరూపించబడినవి. ఆస్త్‌మా కోసం ఇన్‌హేలర్లలో 2 రకాల మందులు ఉన్నాయి:
 |
కంట్రోలర్‌లు |
భవిష్యత్తులో ఎటాక్‌లు రాకుండా ఇన్‌హేలర్లలోా వచ్చే ఈ మందులను నియమానుసారంగా తీసుకోవాలి. కొన్నిసార్లు వాటిని ప్రివెంటర్‌లు అని కూడా అంటారు. ప్రపంచవ్యాప్తంగా, కంట్రోలర్ మందులు మాత్రమే ఆస్త్‌మా నియంత్రణకి సరైనవని నిరూపించబడినవి.
ఈ మందులు వెంటనే ఉపశమనం కలిగించవు కాని వాటిని ఎక్కువ కాలం వాడితే ఆస్త్‌మాని మరింత బాగా నియంత్రించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అంగీకరించబడిన చికిత్స మార్గదర్శాకాల ప్రకారం, నిరంతరం లక్షణాలు ఉన్న ప్రజలు వాపు నియంత్రణ కోసం మరియు
లక్షణాలు మరియు ఎటాక్ నివారణ కోసం తప్పకుండా రోజూ దీర్ఘకాలం వరకు మందులు తీసుకోవాలి.
మీరు మీ కంట్రోలర్‌ను క్రమం తప్పకుండా తీసుకుంటే మీకు
ఆస్త్‌మా ఎటాక్ రాదు. ఒకవేళ మీకు ఎటాక్ వస్తే, మీరు వెంటనే తప్పకుండా రిలీవర్ మందు తీసుకోవాలి. ముఖ్యంగా తెలుసుకోవలసినది ఏమిటంటే కంట్రోలర్ క్రమం తప్పకుండా తీసుకుంటే రిలీవర్ యొక్క అవసరాన్ని తగ్గించవచ్చు మరియు క్రమేపీ మీరు దానిని తక్కువ వాడతారు. కాని మీరు మీ కంట్రోలర్ ప్రతి రోజూ వాడితే అది సాధ్యమవుతుంది. కావున, ఎలా ఐతే నోటి సమస్యలు నివారించటానికి మీరు రోజూ పళ్ళు తోముకుంటారో అలాగ మంచి అలవాటు చేసుకోండి. అదే విధంగా ఆస్త్‌మా ఎటాక్‌లు నివారించడానికి మీరు మీ కంట్రోలర్‌ని తీసుకోవాలి.
కంట్రోలర్‌లను వాడేటప్పుడు చిట్కాలు
| • |
ప్రతి రోజూ ఒకే సమయంలో కంట్రోలర్ మందు తీసుకోండి. అప్పుడు మీరు రోజుకి రెండుసార్లు తీసుకోవలసివస్తే, మీకు వీలైన సమయం సెట్ చేసుకోండి. |
| • |
మీరు మామూలుగా కంట్రోలర్ 2 వివిధ చోటులలో తీసుకుంటే, ఒకసారి ఇంటిలో మరియు మరొకసారి ఉద్యోగం చేసే చోటలో అయితే, మీరు ఒక కంట్రోలర్‌ని ఇంటిలో మరొకటి ఉద్యోగం చేసే చోట పెట్టుకోవచ్చును. కంట్రోలర్ మీతో బాటు తీసుకొని వెళ్ళడం కంటే ఇది మీకు మరింత వీలుగా అనిపించవచ్చును. |
| • |
చాలాసార్లు ఒక రోగి ఇన్‌హేలర్ పనిచేయటం లేదని ఫిర్యాదు చేస్తారు, అప్పుడు రోగి ఇన్‌హేలర్ సరిగ్గా వాడటం లేదని డాక్టర్ తెలుసుకున్నారు. మీరు డాక్టర్ లేదా వారి సహాయకుడి ముందు కంట్రోలర్‌ని వాడడం ఒక మంచి ఉపాయం ఎందుకంటే వారు, ఒకవేళ మీకు దానిని సరిగ్గా వాడటం తెలియకపోతే మీకు చెప్పగలరు. మీ ఆస్త్‌మా నియంత్రణకి మీ ఇన్‌హేలర్ వాడే తీరు ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. |
 |
రిలీవర్‌లు |
ఆస్త్‌మా ఎటాక్ వచ్చినప్పుడు, త్వరగా ఉపశమనం పొందడం కోసం, మరియు ఉపశమనం తక్షణం కలగడానికి వాటిని పీలుస్తారు. ఈ చిన్న నియతకాల మందులుని రిలీవర్‌లు లేదా రెస్కూవర్‌లు అని కుడా అంటారు. అత్యవసర సమయాలలో అవి SOS మందులుగా పనిచేస్తాయి. దగ్గు మరియు ఊపిరి పీల్చుకునే ఇబ్బందులు నుండి ఉపశమనం కలిగించడానికి
ఎటాక్ వచ్చినప్పుడు అవి సహాయపడతాయి. కాబట్టి ఎప్పుడైనా మీకు ఊపిరాడటం లేదని అనిపిస్తే లేదా ఎటాక్ యొక్క తొలిసూచనలు కనబడతే, వెంటనే డాక్టర్ ఇచ్చిన రిలీవర్‌ని వాడండి. కొన్ని పఫ్‌లను పీల్చండి. గాలి వెళ్ళే మార్గాలలో ఉన్న కండరాలని అది వదులు చేసి, సులువుగా గాలి పీల్చుకునేలాగా చేస్తుంది.
ఆస్త్‌మా రోగులు అత్యవసర సమయంలో, ఒకవేళ బయటికి వెళ్ళినప్పుడు, తప్పకుండా వాళ్ళతో రిలీవర్‌లు తీసుకొని వెళ్ళాలి. ఏ హెచ్చరిక లేకుండానే ఆస్త్‌మా ఎటాక్ రాగలదు.
రిలీవర్‌లు వాడేటప్పుడు చిట్కాలు
| • |
మీరు ఎప్పుడూ మీ రిలీవర్ని మీ దగ్గర పెట్టుకోవాలి. ఒకటైనా లేకుండా ఎప్పుడూ ఉండకూడదు. ఆస్త్‌మా ఎటాక్ ఎప్పుడైనా ఎక్కడైనా రావచ్చును. |
| • |
2 రిలీవర్‌లు పెట్టుకోండి - ఒకటి ఆఫీసులో మరియు ఇంటిలో మరొకటి. ఒకవేళ మీ బిడ్డకి ఆస్త్‌మా ఉంటే, ఒక రిలీవర్ పాఠశాలలో పెట్టండి. |
| • |
డాక్టర్‌కి లేదా ఆయన సహాయకుడికి మీరు మీ ఇన్‌హేలర్ ఎలా వాడుతున్నారో ప్రదర్శించండి. ఒకవేళ సరిగ్గా వాడకపోతే వారు మిమ్మలిని సరిచేయగలరు. ఎటాక్ సమయంలో మీ ఇన్‌హేలర్ యొక్క సరైన వాడుక మీ ఆస్త్‌మా నుండి ఉపశమనం కలిగించడంలో చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. |
| • |
మీరు ఇంటి దగ్గర మీ కుటుంబానికి లేదా ఉద్యోగం చేసే చోట లేదా పాఠశాలలో స్నేహితులకు ఇన్‌హేలర్ సరిగ్గా ఎలా వాడాలో తెలియజేయండి. ఒకవేళ మీకు ఎటాక్ వస్తే, మీ ఇన్‌హేలర్‍తో వారు మీకు సహాయపడవచ్చును. |
| • |
మీకు ఆస్‌్ామా ఎటాక్ వచ్చినప్పుడు, ఏమి చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. |
దయచేసి గమనించండి: డాక్టర్ ఇచ్చిన మందు మరియు ఇన్‌హేలర్ రకం యొక్క వాడుక తప్పక అనుసరించండి. మీ డాక్టర్‍ని ఇన్‌హేలర్ వాడుక మరియు భద్రపరిచే విధానం ప్రదర్శించమని అడగాలని గుర్తుంచుకోండి. మీ ఇద్దరి మొదటి సెషన్ చాలా కీలకమైనది మరియు అది మీరు మొదటిసారే అన్ని అర్ధం అయినట్లు చూసుకోండి. ఇది మీ ఆస్త్‌మా నియంత్రణకు మీ పోరాటంలో మీకు సహాయపడుతుంది.
ఒకవేళ మీ డాక్టర్ మీకు 2 ఇన్‌హేలర్‌లు ఇస్తే, ఒకటి మీ కంట్రోలర్ మరొకటి మీ రిలీవర్. ఏది మీ కంట్రోలర్ ఏది మీ రిలీవరో మీ డాక్టర్‌ని అడగడం మర్చిపోకండి. మీరు గుర్తుపెట్టుకోవడానికి మీకు సహాయపడేటట్లు ప్యాక్‌ల మీద "కంట్రోలర్" మరియు " రిలీవర్" అని కూడా మీరు వ్రాయవచ్చును.
ప్రపంచవ్యాప్తంగా, ఇన్‌హలేషన్ ఆస్త్‌మా నియంత్రణకి ఒక సులభమైన, సురక్షితమైన మరియు ప్రభావవంతమైన మార్గం మరియు ఆనందంగా నాణ్యమైన జీవితాన్నిగడపవచ్చును. ఇన్‌హలేషన్‌లో మీరు ఇన్‌హేలర్ అనబడే చిన్న పరికరం వాడి మందుని నోటి ద్వారా పీలుస్తారు. రోగి యొక్క వయసు, సౌకర్యం లేదా ఆస్త్‌మా యొక్క తీవ్రత బట్టి ఆస్త్‌మా రోగుల యొక్క వివిధ అవసరాలకి సరిపడేలాగా వివిధ రకాల ఇన్‌హేలర్లు ఉన్నాయి.
2 ముఖ్యమైన ఇన్‌హేలర్లు ఏమనగా మీటెర్డ్ డోస్ ఇన్‌హేలర్లు (MDIs) మరియు డ్రై పౌడర్ ఇన్‌హేలర్లు (DPIs).
మీటెర్డ్ డోస్ ఇన్‌హేలర్‌ని (MDI) సులువుగా స్ప్రే ఇన్‌హేలర్‌ని కూడా అంటారు ఎందుకంటే అది అదే విధంగా పనిచేస్తుంది. ఇన్‌హేలర్ వాడేటప్పుడు పంపింగ్ ప్రక్రియ వలన కొందరు దానిని 'పంప్' అని అంటారు.
చాలామంది డాక్టర్‌లు డ్రై పౌడర్ ఇన్‌హేలర్లు (DPIs) తమ రోగులకు ఇస్తారు.
ఇన్‌హేలర్లు ఎలా ఉత్తమమైనవో తెలుసుకునేందుకు ఇక్క
డ క్లిక్ చేయండి
ఇన్‌హేలర్‌ని సరిగ్గా ఎలా వాడాలో నేర్చుకోండి.
ఆస్త్‌మా ఎలా నియంత్రణలో ఉంచాలి |
ఆస్త్‌మా అనేది దీర్ఘకాలం ఉండే రోగం కాబట్టి దానికి క్రమబద్ధమైన చికిత్స మరియు నిర్వహణ అవసరం. మీరు తెలుసుకోవలసినది ఏమిటంటే ఆస్త్‌మాతో పోరాడవచ్చు, కాని దానిని నియంత్రణలో ఉంచి మీరు గెలుపు సాధించవచ్చు.
అప్పుడు మీకు మరొక attack చాలా అరుదుగా వచ్చి, మీరు ఆరోగ్యవంతంగా మరియు సంపూర్ణంగా జీవించవచ్చును.
మీ ఆస్త్‌మాని నియంత్రణలో ఉంచటానికి ఈ క్రింది 4 దశలను అనుసరించండి.
 |
ఆస్త్‌మా ట్రిగ్గర్స్‌ని తప్పించుకోండి. |
 |
క్రమం తప్పకుండా కంట్రోలర్ మందు వాడండి. |
 |
పీక్ ఫ్లో మీటర్ (బ్రీతోమీటర్) వాడి క్రమం తప్పకుండా మీ ఊపిరితిత్తుల యొక్క శక్తిని మీరే పరీక్షించుకోండి. |
 |
డాక్టర్ దగ్గరకి క్రమం తప్పకుండా వెళ్ళండి. |
ఆస్త్‌మా నియంత్రణ మార్గం వైపు మీరు వెళ్ళాలంటే మీరు ఈ 4 విషయాల మీద మీ దృష్టి కేంద్రీకరించండి.
 |
మీ ట్రిగ్గర్స్ కోసం పరిశీలించండి |
ఆస్త్‌మా ప్రతి ఒక్కరికి వేరు వేరుగా ఉంటుంది. ఒక పెద్ద మనిషికి మరొక పెద్ద మనిషికి మధ్య వేరుగా ఉంటుంది. ఒక శిశివుకి మరొక శిశివుకి మధ్య వేరుగా ఉంటుంది. అందుకే ముఖ్యమైనది ఏమిటంటే మీకు ఉన్న ఆస్త్‌మా, లక్షణాలు మరియు మీ
ట్రిగ్గర్స్ ఏ రకమో అర్థం చేసుకోవాలి.
కొన్ని విషయాలు వల్ల ఆస్త్‌మా లక్షణాలు సంభవిస్తాయి లేదా ట్రిగ్గర్ అవుతాయి, వాటికి మీరు దూరంగా ఉంటే మీ ఆస్త్‌మాని నియంత్రించవచ్చును. సిగరెట్ పొగ, వాతావరణ కాలుష్యము, డస్ట్ మైట్స్, శరీర ఒత్తిడి మరియు వ్యాయామం, పుప్పొడి, బొచ్చు, లేదా ఈకలు కొన్ని సాధారణమైన ట్రిగ్గర్స్. జలుబు, దగ్గు మరియు వైరస్‌లు వంటి అస్వస్థతలు, భయం, ఏడుపు, నవ్వు వంటి ఉద్రేకాలు, కొన్ని సాధారణంగా లభ్యమయ్యే పెయిన్ రిలీవర్‌లతో సహా కొన్ని ప్రత్యేక మందులు అన్నీ ట్రిగ్గర్సే.
మీకు సంబంధించిన ముఖ్యమైన ట్రిగ్గర్ మీరు కనుగొంటే, వాటిని అధిగమించడానికి మీరు శాయశక్తులా ప్రయత్నించండి. వాటితోబాటు, క్రమం తప్పకుండా ఇన్‌హలేషన్ చికిత్స తప్పకుండా మీ ఆస్త్‌మాని నియంత్రణలో ఉంచటానికి సహాయపడుతుంది.
 |
క్రమం తప్పకుండా కంట్రోలర్ మందు తీసుకోండి |
మీ ఆస్త్‌మా లక్షణాలని నియంత్రణలో ఉంచడానికి ఏ మందులు తీసుకోవాలి మరియు ఎప్పుడు తీసుకోవాలి అనేది తెలుసుకోవటం చాలా ముఖ్యం. అందుకే కంట్రోలర్ ఇన్‌హేలర్‌ని డాక్టర్ చెప్పినట్లుగానే క్రమం తప్పకుండా వాడండి. ఇది ట్రిగ్గర్‌తో మీరు సంపర్కం చేసినప్పుడు ఆస్త్‌మా ఎటాక్ వచ్చే అపాయమును తగ్గిస్తుంది. మీకు బాగునట్లు అనిపించినా కంట్రోలర్ ఆపివేయడం వంటి తప్పు దయచేసి చేయకండి. ఎందుకు? BP రోగి అకస్మాతుగా BP మందులు మానేస్తే ఆ రోగి BP పెరగవచ్చును. అదే విధంగా మీరు మీ కంట్రోలర్ ఆపివేయడం వలన మీకు మరొకసారి
ఆస్త్‌మా ఎటాక్ రావచ్చును.
మీరు గుర్తుపెట్టుకోవలసినది ఏమిటంటే మీ డాక్టర్‌ని సంప్రదించకుండా ఆస్త్‌మా చికిత్స ఎన్నడూ ఆపకూడదు అనేది ఒక ముఖ్యమైన విషయం.. మీరు మెరుగైనప్పుడు మరియు ఆయన మిమ్మల్ని ఆరోగ్యంగా చూసినప్పుడు డాక్టర్ నెమ్మదిగా మోతాదు తగ్గించవచ్చును అనేది గుర్తుపెట్టుకోండి.
మీకు త్వరగా ఉపశమనం కావాలంటే వెంటనే రిలీవర్ మందు వాడండి. మీరు క్రమం తప్పకుండా ఇవన్నీ అనుసరిస్తే, మీ ఆస్త్‌మాని నియంత్రణలో ఉంచవచ్చును.
 |
పీక్ ఫ్లో మీటర్ (బ్రీతోమీటర్) వాడి క్రమం తప్పకుండా ఊపిరితిత్తు యొక్క శక్తిని తనిఖీ చేసుకోండి |
ఎలాగైతే మీ BPని బ్లడ్ ప్రెషర్ పరికరంతో లేదా మీ శరీర ఉష్ణోగ్రత థెర్మామీటర్‌తో తనిఖీ చేస్తారో అలాగే మీ ఊపిరితిత్తుల యొక్క శక్తిని తనిఖీ చేయడానికి పీక్ ఫ్లో మీటర్ (బ్రీతోమీటర్) ఉంది. పీక్ ఫ్లో మీటర్‌తో (బ్రీతోమీటర్) చాలా సులువుగా మీ ఆస్త్‌మాని పరీక్షించవచ్చును. ఈ మామూలు పరికరం మీరు ఎంత బాగా ఊపిరితిత్తుల నుండి గాలి బయటికి ఊదగలరో కొలవగలదు.
మీకు మీరుగా పీక్ ఫ్లో మీటర్ (బ్రీతోమీటర్) వాడటం ఎంత సులువో చూడండి.
చికిత్స మరియు కంట్రోలర్ మందులు క్రమం తప్పకుండా తీసుకోవటం మొదలుపెట్టిన తరువాత, మీరు పీక్ ఫ్లో మీటర్ (బ్రీతోమీటర్) వాడి మీ గాలి పీల్చుకునే పరీక్షా ఫలితాలు ఎలా మెరుగు పడుతున్నవో చూడవచ్చును. ఈ విధంగా ఆస్త్‌మా నియంత్రణ మెరుగుదల మీరు ఇక ఊహించనఖ్ఖరలేదు.
మీరు మీ లక్ష్యాన్ని మీ డాక్టర్‌తో సెట్ చేసుకొని మరియు
మీ అభివృద్ధిని కొలవండి. ఇది ప్రతి దశలో మీరు అర్ధం చేసుకుని, ఆరోగ్యంగా ఉండడానికి మరియు మీ ఆస్త్‌మా యొక్క నియంత్రణకి తప్పక సహాయపడుతుంది. మీరు ఒకసారి మీ లక్ష్యాన్ని చేరినప్పుడు, ఒకవేళ మీరు చెక్ అప్‌లకి క్రమం తప్పకుండా వెళ్ళినప్పుడు...డాక్టర్ మీ మోతాదు తగ్గించవచ్చును.
ఆస్త్‌మా నియంత్రణలో ఉంచడానికి డాక్టర్ సిఫార్సు చేసిన పీక్ ఫ్లో మీటర్ (బ్రీతోమీటర్) క్రమం తప్పకుండా వాడడం మంచిది. మీకు కొద్దికాలం వరకు ఎటాక్ రాకపోయినా ఈ పరీక్షలు క్రమం తప్పకుండా చెయ్యించుకోవటం అవసరం.
పీక్ ఫ్లో మీటర్ (బ్రీతోమీటర్) పరీక్ష మీకు ఎక్కడ చేయించుకోవచ్చును? పీక్ ఫ్లో మీటర్ (బ్రీతోమీటర్) పరీక్ష గురించి క్లీనిక్‌కి వెళ్ళినప్పుడు డాక్టర్‌ని అడగండి. మీ డాక్టర్‌ని సంప్రదించినప్పుడు పీక్ ఫ్లో మీటర్ (బ్రీతోమీటర్) మీద ఉన్న మీ వ్యక్తిగత మంచి ఫలితాన్ని వ్రాసుకోండి. మీ సొంత పీక్ ఫ్లో మీటర్ (బ్రీతోమీటర్) మీ కెమిస్ట్ దగ్గర కూడా కొనుక్కోవచ్చు.
 |
మీ డాక్టర్ దగ్గరకి క్రమం తప్పకుండా వెళ్ళండి |
| • |
ఆస్త్‌మా గురించిన పోరాటంలో మీకు మీ డాక్టర్‌కి 50:50 భాగస్వామ్యం ఉన్నది. మీకు ఆరోగ్యం బాగా ఉన్నట్లు అనిపించినా ఆయన దగ్గరకు క్రమం తప్పకుండా వెళ్ళండి. మీ యొక్క ఇన్‌హేలర్ లాభాలు గురించి ఆయనను అడిగి తెలుసుకోండి. ఆయన సహాయంతో ఇన్‌హేలర్ ఎలా సరిగ్గా నిర్వహించి మరియు వాడాలో నేర్చుకోండి. మీ అంతట మీరు ఎప్పుడూ చికిత్సని ఆపివేయకండి. డాక్టర్ సిఫార్సు చేసిన విధంగా మందులు తీసుకోండి.
డాక్టర్ మీకు ఇచ్చిన సలహా ప్రకారం పరీక్షలు అన్నీ చేయించుకోండి మరియు విశ్వాసంగా మీ చికిత్సని తప్పక అనుసరించండి.
|
| • |
|
| • |
మీరు తీసుకుంటున్న ఏ మందు గురించైనా డాక్టర్‌కి తెలియజేయాలని మరిచిపోకండి. కొన్ని నొప్పి రిలీవర్‌లు ఆస్త్‌మా లక్షణాలని ట్రిగ్గర్ చేయవచ్చును. కావున ఎప్పుడైనా మీకు ఆరోగ్యం బాగా లేనప్పుడు - అది నడుము నొప్పి లేక జ్వరం లేదా జలుబు లేక మరేదైనా అయినప్పుడు, ముఖ్యంగా మీరు మీ కళ్ళకి మందు తీసుకుంటునప్పుడు, దయచేసి మీరు తీసుకుంటున్న మందు గురించి మీ డాక్టర్‌కి తెలియజేయండి. |
ఆస్త్‌మా మరియు మీ జీవనసరళి
 |
మీరు ఏ ప్రత్యేక ఆహారం తీసుకోనఖ్ఖరలేదు మరియు మీరు ఇష్టపడిన, ప్రత్యేకమైన ఏదైనా ఐస్ క్రీం లేదా చాక్లెట్ లాంటివి మీరు మాననఖ్ఖరలేదు. మీరు అతిగా తిననంత వరకు... మీరు ఆనందంగా తినే ఆహారాలని తినకుండా ఆస్త్‌మా మిమ్మల్నిఆపదు. ట్రిగ్గర్ సంభవించే అవకాశమున్న ఆహారాలు, మీకు పడని, గింజలు, కాన్‌లలో ఉన్న, సీసాలలో, లేదా పోట్లాలలో నిల్వచేసిన ఆహారం ప్రిజర్వేటివ్‌లు ఉన్నవి తినకూడదని గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఆహారం మీకు పడదని అనిపిస్తే, మార్గదర్శకానికి మీ డాక్టర్‌ని సంప్రదించండి. |
 |
అందరికి పని ముగించుకొన్న తరువాత ఒత్తిడి స్థాయిలు తగ్గించడానికి విశ్రాంతి మరియు సమయం అవసరం. ఆస్త్‌మాలో ఒత్తిడి అనేది చాలా సాధారణ ట్రిగ్గర్ అందుకే మీకు తప్పకుండా ఎక్కువగా విశ్రాంతి అవసరం.
సులభముగా విశ్రమించే పద్ధతులు నేర్చుకుని అవి మీ జీవితంలో ఒక భాగంగా చేసుకోండి. మంచి గురువు దగ్గర యోగ మొదలుపెట్టండి. విశ్రాంతి తీసుకునే అలవాటుని పెంపొందించండి. ఉద్యానవనంలో విహరించండి, మీకు ఇష్టమైన చలన చిత్రాన్ని చూడండి.... మీకు ఆనందాన్ని ఇచ్చేది మరియు మీకు ఒత్తిడి కలిగించే పని లేదా విషయాలు నుండి ఉపశమనం ఇచ్చే పనిని చేయండి. |
 |
|
ఆస్త్‌మా ఎటాక్ వచ్చినప్పుడు ఏమి చేయాలి |
మీరు మీ కంట్రోలర్ మందు క్రమం తప్పకుండా తీసుకోవాలి మరియు
ట్రిగ్గర్స్‌ని అధిగమించాలి మీకు ఎటాక్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. కాని అత్యవసర సమయంలో మీరు తప్పకుండా ఈ క్రింది దశలను అనుసరించండి:
 |
మీరు తప్పకుండా నిటారుగా కూర్చోవాలి మరియు క్రింద పడుకోకూడదు. మీ బట్టలు వదులుగా చేసుకోవాలి. మీరు విశ్రాంతిగా మరియు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. మీ దగ్గరున్న బంధువు లేక స్నేహితుడు మీకు ఏ విధంగానైనా సహాయపడాలి మరియు మీకు ధైర్యం చెప్పాలి. |
 |
ఆలస్యం చేయకుండా, మీ డాక్టర్ చెప్పిన మోతాదులో రిలీవర్ మందు వెంటనే తీసుకోవాలి. |
 |
తరువాత 5 నిముషాలు వేచి వుండండి. ఒకవేళ ఏమీ మెరుగుదల కనబడకపోతే, మీ డాక్టర్ సలహా ప్రకారం రిలీవర్ మందు ఎక్కువ మోతాదులో తీసుకోండి. |
 |
అయినా కూడా మీకు ఉపశమనం కలగకపొతే మీ డాక్టర్‌ని వెంటనే పిలవండి. మీ డాక్టర్‌ని సంప్రదించకుండా రిలీవర్ మందు ఎక్కువ మోతాదులో తీసుకోకూడదని గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం. |
 |
ఒకవేళ మీ డాక్టర్ మీకు అందుబాటులో లేకపోతే మీరు వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి అత్యవసర చికిత్సకి వెళ్ళాలి. |
ప్రత్యేక పరిస్థితులలో ఆస్త్‌మా (చికిత్స జరుగుతున్నప్పుడు మరియు నియంత్రణ |
మీకు ఆస్త్‌మా ఉంటే జీవితం ముగిసిపోయినట్లు కాదు. ఆస్త్‌మాని నియంత్రించవచ్చు మరియు మీరు సామాన్య జీవితాన్ని గడపవచ్చునని మీరు తెలుసుకోవాలి. ప్రత్యేక పరిస్థితులలో ఆస్త్‌మా గురించి ఈ క్రింది విభాగం వివరిస్తుంది. మేము వివరించే కొన్ని అంశాలు: గర్భధారణతో ఉన్నపుడు ఆస్త్‌మా, ఆస్త్‌మా మరియు పిల్లలకి పాలిస్తున్న తల్లులు, ఆస్త్‌మా మరియు మీ ఉద్యోగం, ఆస్త్‌మా మరియు ప్రయాణం, ఆస్త్‌మా మరియు పొగతాగడం, ఆస్త్‌మా మరియు దానికి సరైన మందులు, ఆస్త్‌మా మరియు ఎలర్జిక్ రైనైటిస్ మొదలైనవి.
 |
గర్భధారణతో ఉన్నపుడు ఆస్త్‌మా: |
మొదటిది, మీరు పిల్లల్ని కనాలనుకుంటే, గర్భధారణకు ఆస్త్‌మా అడ్డు రాదు. రెండవది, ఒకవేళ మీరు గర్భధారణతో ఉన్నప్పుడు మీకు ఆస్త్‌మా ఉంటే, మీకు మాములుగా సురక్షితమైన ప్రసవం అవుతుంది. క్రమం తప్పకుండా మందులతో మీ ఆస్త్‌మా నియంత్రణలో ఉండడం అనేది చాలా ముఖ్యం మరియు గర్భధారణతో ఉన్న ఏ తల్లి అయినా తీసుకునే జాగ్రత్తలు మీరూ తీసుకోండి - మీ డాక్టర్ మీకు సరైన మార్గదర్శకం చూపుతారు. కొన్నిసార్లు, మీరు మందులు క్రమం తప్పకుండా తీసుకోకపోతే, ఆస్త్‌మా లక్షణాలు ఎక్కువ అవ్వచ్చును. పీల్చే మందులు వాడటం వలన కడుపులో ఉన్న పిండానికి ఏమీ హాని లేదని నిర్ధారించబడినది.
 |
పాలు ఇస్తున్న తల్లులలో ఆస్త్‌మా: |
ఒకవేళ మీకు ఆస్త్‌మా ఉంటే మరియు మీరు మీ చనుపాలు మీ శిశివుకి ఇవ్వాలని అనుకుంటే, దయచేసి ఇవ్వండి. ఆస్త్‌మా అంటువ్యాధి కాదు. ఇకముందే మీరు ఇన్‍హలేషన్ చికిత్స తీసుకుంటే, అతి తక్కువ మోతాదులో ఆస్త్‌మా మందు చనుపాలల్లోకి వెళుతుంది. నిజానికి,
ప్రపంచ వ్యాప్తంగా ఇన్‌హలేషన్ చికిత్స తీసుకున్నవారు వారి పిల్లలకి చనుపాలు ఏ సైడ్ ఎఫెక్ట్‌లు లేకుండా ఇచ్చారు. మరొక గమనించదగ్గ విషయం ఏమిటంటే పీల్చే మందు చాలా సురక్షితమైనది కాబట్టి, గర్భధారణతో ఉన్నప్పుడు నిర్భయంగా తీసుకోవచ్చును.
 |
మీ ఉద్యోగంపై ఆస్త్‌మా ప్రభావం: |
ఒకవేళ మీ ఆస్త్‌మా బాగా నియంత్రణలో ఉంటే మీరు మీ పని మానఖ్ఖరలేదు, లేదా జీతం కోత గురించి బాధపడనఖ్ఖరలేదు. నగల వ్యాపారం, ముద్రణ, క్రిమిసంహారకం, క్వారీ, పెయింటింగ్, మరియు ప్లాస్టిక్ పరిశ్రమలలో పనిచేసే వాళ్ళు, వంట వాళ్ళు మరియు బేక్ చేసే వాళ్ళు, సోల్డరింగ్ మరియు మెటల్ ప్లేట్ పనిచేసే వారు, ఫోమ్ పనివారు మరియు స్ప్రే పెయింట్ పనిచేసే వారు, మంగలి వారు మరియు వడ్రంగులకి ఆస్త్‌మా వచ్చే అవకాశం ఉంది. బహుశా కొన్ని రసాయనాల వాసన లేక కొన్ని పదార్ధాల వల్ల ఊపిరితిత్తులలో ఇబ్బంది కలగవచ్చును. వీటిని
ట్రిగ్గర్స్ అని అంటారు.
మీ ట్రిగ్గర్‌ని మీరు తెలుసుకోవడం చాలా ముఖ్యం, తగిన జాగ్రత్తలు తీసుకొని, కంట్రోలర్‌ని సరిగ్గా మరియు క్రమం తప్పకుండా తీసుకొని, మరియు తప్పకుండా మీకు సరైన సలహానిచ్చే డాక్టర్‌ని కలవడం కూడా ఎంతో ముఖ్యం.
 |
ప్రయాణంలో ఆస్త్‌మా ప్రభావం: |
మీ ప్రయాణం లేదా ఉద్యోగానికి ఆస్త్‌మా అడ్డు రాకూడదు. మీరు ఉద్యోగరిత్యా తరుచుగా ప్రయాణం చేయవలసివస్తే, మీ డాక్టర్ ఇచ్చిన మందుల యొక్క కాపీని, వ్రాసుకున్న సూచనలు మరియు మీ అత్యవసర పరిచయాల నంబరులు మీ దగ్గర పెట్టుకోండి. ముఖ్యంగా,
సరిపడా మందు లేకుండా ఎప్పుడూ ప్రయాణం చేయకండి - కంట్రోలర్‌లు మరియు రిలీవర్‌లు. మీకు తెలిసిందే మీరు కంట్రోలర్ క్రమం తప్పకుండా తీసుకోవాలి. నిజానికి, మీరు ఎప్పుడూ అదనపు రిలీవర్‍ని మీ దగ్గర పెట్టుకొమ్మని మేము సిఫార్సు చేస్తాము. ప్రయాణం చేసే ముందు మీరు వాతావరణం చూసుకొని మరియు రానున్న వాతావరణ మార్పులు ప్రకారం సరిపడే బట్టలు తీసుకెళ్ళండి.
మరింత తెలుసుకోండి…
 |
ఆటల్లో ఆసక్తి ప్రభావం: |
జీవితంలో లేదా ఆటలలో గెలవడానికి ఆస్త్‌మా మీకు అడ్డుగోడ కాదు. పెద్ద క్రికెట్ ఆటగాళ్ళకి ఆస్త్‌మా ఉంది, బాస్కెట్ బాల్ ఆటగాళ్ళకి ఆస్త్‌మా ఉంది, చివరికి ఈతగాళ్ళకి మరియు పరిగెత్తే ఆటగాళ్ళకి కూడా ఆస్త్‌మా ఉంది,
కాని వాళ్ళందరూ ఒలంపిక్ బంగారు పతకాలు కూడా గెలుచుకున్నారు.
ఒకవేళ మీకు ఆస్త్‌మా ఉండి అది నియంత్రణలో ఉంటే, మీరు వ్యాయామం చేయవచ్చు మరియు ఆటలు కూడా ఉత్తేజవంతంగా ఆడవచ్చును. మీ డాక్టర్ చెప్పిన విధంగా కంట్రోలర్ మందు మీరు క్రమం తప్పకుండా తీసుకోవటం చాలా ముఖ్యం. కొంతమంది ఆస్త్‌మా ఉన్నవాళ్ళు రిలీవర్/రెస్కూవర్‌ని వ్యాయామం ముందు తీసుకుంటారు. అందుకే ఎప్పుడూ రిలీవర్‌ని మీకు అందుబాటులో పెట్టుకోండి. ఒకవేళ అవసరమైతే అదనపు మందులు మీతో తీసుకు వెళ్ళడం మరచిపోకండి. మీ బృందం సభ్యులకి, మీ స్నేహితులకి, మీ జిమ్ అధ్యక్షుడికి లేదా మీకు శిక్షణ ఇచ్చేవారికి మీకు ఎటాక్ వస్తే ఎమి చేయాలో తెలియజేయండి.
ఆస్త్‌మాకి యోగ, మరియు ఈత మరియు స్ప్రిన్టింగ్ వంటి ఆటలు మంచివి, ఎందుకంటే వాటిలో నిరంతరం పరుగెత్తడం ఉండదు మరియు మధ్యలో మీకు విరామం లభిస్తుంది. వ్యాయామం మరియు ఆటలు గురించి మీకు ఆసక్తి ఉంటే, దయచేసి మీ డాక్టర్‌ని క్రమం తప్పకుండా సంప్రదించండి.
 |
ఆస్త్‌మా మరియు ఎలర్జిక్ రైనైటిస్: |
ఆస్త్‌మా మరియు ఎలర్జిక్ రైనైటిస్‌కి చాలా దగ్గరైన సంబంధం ఉంది (నేసల్ ఎలర్జీ). ఎలర్జిక్ రైనైటిస్ ఉన్నవారికి సాధారణంగా తరుచుగా జలుబు మరియు చీవిడి కారే ముక్కు కూడా ఉంటాయి. ఆస్త్‌మా ఉన్న 70% రోగులకి ఎలర్జిక్ రైనైటిస్ కుడా ఉంది, ఎందుకంటే ముక్కు, రెస్పిరేటరీ గొట్టం యొక్క పొడిగింపు. సామాన్యంగా ముందుగా ముక్కు తరువాత ఊపిరితిత్తులు ప్రభావితమవుతాయి. అందుకే ఆస్త్‌మా యొక్క నియంత్రణ మెరుగుపరచడానికి ఎలర్జిక్ రైనైటిస్‌ని కనుగొని మరియు దానికి చికిత్స చేయడం ఎంతో ముఖ్యం .
దుమ్ము, పెంపుడు జంతువులు, లేదా పుప్పొడి వంటివి పీలిస్తే ఎలర్జీ లక్షణాలు కనబరిచే వారికి ఎలర్జిక్ రైనైటిస్ ఉందని అర్ధం.
ఆ లక్షణాలు ఈ క్రింది ఇవ్వబడ్డాయి:
• చీవిడి కారే ముక్కు (ముక్కునుండి ఆగకుండా కారే నీరు)
• తుమ్ములు
• ముక్కులో అడ్డం ఉండడం
• ముక్కులో దురద (ముక్కు, కళ్లు లేదా నోటి పై భాగంలో దురద పెట్టడం)
ఈ లక్షణాలన్నీ సంవత్సరంలో ఒక ప్రత్యేకమైన కాలంలో మాత్రమే సంభవించవచ్చును. దీనిని సీసనల్ ఎలర్జిక్ రైనైటిస్ (SAR) అని అంటారు. ఒకవేళ సంవత్సరం అంతా వస్తే, దానిని పెరీనియల్ ఎలర్జిక్ రైనైటిస్ (PAR) అని అంటారు.
మీరు ఎలర్జిక్ రైనైటిస్‌ని అశ్రద్ధ చేయకూడదు ఎందుకంటే దానికి సరైన సమయంలో చికిత్స చేయకపోతే, అప్పుడు ఆస్త్‌మా ఎక్కువై అది చెవి ఇన్ఫెక్షన్, సైనసైటిస్ వంటి ఇతర క్లిష్టమైన పరిస్థితులకి దారి తీయవచ్చును...సరైన చికిత్స కోసం తప్పకుండా మీ డాక్టర్‌ని సంప్రదించండి.