Home
  Breathe Free
ఇది దగ్గా లేదా ఆస్త్‌మానా?
చికిత్స మరియు నియంత్రణ
FAQ & మద్దతు

ఇది దగ్గా లేదా ఆస్త్‌మానా?

 
ఇది దగ్గా లేక ఆస్త్‌మా?  
దగ్గు అంటే ఏమిటి?  
ఆస్త్‌మా అంటే ఏమిటి?  
ఆస్త్‌మా యొక్క లక్షణాలు  
ఆస్త్‌మా రోగ నిర్థారణ  
ఆస్త్‌మా ట్రిగ్గర్స్ మరియు వాటిని తప్పించుకోవడం  
దగ్గు గురించి మరింత తెలుసుకోండి  

  ఇది దగ్గా లేక ఆస్త్‌మా?


దగ్గు మరియు ఆస్త్‌మా, రెండూ వేర్వేరు. కాని ఆస్త్‌మా ఉన్న వారు, సాధారణంగా గాలి పీల్చుకోవడానికి కష్టపడతారు మరియు ఎక్కువగా దగ్గుతారు. మీరు గాని లేదా మీ పిల్లలు గాని దగ్గు తగ్గడానికి తరచూ దగ్గు మందు వాడుతున్నారంటే, అప్పుడు అసలైన సమస్య మరేదైనా అయి ఉండవచ్చును. నిజానికి, తరచుగా ఉండే దగ్గు ఆస్త్‌మాకి సూచన అయి ఉండవచ్చు. మీకు గాని లేదా మీ దగ్గర వారికి గాని ఆస్త్‌మా ఉంటే, అది మీ ప్రపంచం యొక్క అంతం కాదు. ఎందుకంటే, దానిని తగ్గించి, మీరు కూడా లక్షలాది ఇతర ఆస్త్‌మా ఉన్నవారిలా మామూలుగా, హుషారుగా జీవించవచ్చు.



















  దగ్గు అంటే ఏమిటి?


మీరు మీ జీవితంలో ఎప్పుడోకప్పుడు దగ్గుతో బాధపడి ఉండవచ్చు. కాని మీకు దగ్గు ఎందుకు వస్తుందో మరియు ఏమి జరుగుతుందో సరిగ్గా తెలియదు. సాధారణంగా చెప్పాలంటే, దగ్గు మీ ఊపిరితిత్తుల నుండి హానికరమైన పదార్థాలను తొలగించే మీ దేహం యొక్క సహజమైన ప్రతిస్పందన. ఈ పదార్థాలు సాధారణంగా దుమ్ము, వైరస్‌లు, క్రిములు లేదా స్రావాలు.

విపరీతమైన దగ్గు, మీ ఊపిరితిత్తులలో సమస్యకు సూచన అయి ఉండవచ్చు.

మీరు మీ దగ్గు కోసం దగ్గు మందులు ఉపయోగిస్తుంటే, దగ్గు మందులలో మీకు తాత్కాలికమైన ఉపశమనాన్ని ఇచ్చి ఊపిరితిత్తులలో గల సమస్యపై ముసుగువేసే హానికరమైన స్టిములెంట్లు ఉండవచ్చని దయచేసి గుర్తుపెట్టుకోండి. మీకు దీర్ఘకాలం నుండి దగ్గు ఉంటే, దయచేసి డాక్టర్‌ను సంప్రదించడంలో ఆలస్యం చేయవద్దు.










  ఆస్త్‌మా అంటే ఏమిటి?


ఆస్త్‌మా అనేది ఊపిరితిత్తుల యొక్క వాయునాళాలని ప్రభావితం చేస్తుంది, అంటే, మీ ఊపిరితిత్తుల నుండి గాలిని లోపలికి మరియు బయటకి తీసుకొని వెళ్ళే నాళాలన్నమాట. [వీడియో చూడండి] ఆస్త్‌మా ఉన్నప్పుడు, ఊపిరితిత్తుల వాయునాళాల చుట్టూ ఉన్న కండరాలు బిగుతుగా అయ్యి సన్నబడతాయి. అందువల్ల ఊపిరి పీల్చడం కష్టం అవుతుంది. చాలా సార్లు, పిల్లికూతల శబ్ధం వస్తుంది. ఆస్త్‌మాలో, మీ వాయునాళాలు ఎంతో సున్నితంగా ఉండి సిగరెట్ పొగ, పూల పుప్పొడి లేదా చల్లటి గాలి వంటి ఎన్నో ట్రిగ్గర్స్ అనబడే ఇర్రిటెంట్స్‌కి ప్రతిస్పందిస్తాయి.

ఇప్పుడు మీకు ఆస్త్‌మా ఉన్నా లేదా మీకు ఆస్‌్ిమా ఉన్నవారు ఎవరైనా తెలిస్తే, మీరు చేయవలసిన మొదటి పని: మీరు ఖంగారు పడవద్దు. అది మీ ఒక్కరికే కాదు, చాలా మందికి ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) ప్రకారం సుమారు 300 మిల్లియన్ల ప్రజలు ఆస్త్‌మాతో బాధపడుతున్నారు. ఇది పిల్లలలో అతి సాధారణమైన దీర్ఘకాలపు (ఎక్కువ కాలం ఉండే) వ్యాధి. కేవలం భారతదేశంలోనే ఆస్త్‌మా వల్ల 25-30 మిల్లియన్ల ప్రజలు బాధపడుతున్నట్లు WHO రిపోర్ట్ వక్కాణిస్తుంది.

పూర్వకాలం, ఆస్త్‌మా అంటే అందరూ భయపడేవారు, కాని ఈ రోజులలో, ఈ వ్యాధి గురించి మరింత సమాచారం మరియు అధునాతన మందులు అందుబాటులో ఉండడం వల్ల, మీకు ఆస్త్‌మా ఉన్నా సరే సాధారణమైన, చురుకైన జీవితాన్ని కొనసాగించవచ్చు. కొందరు సినిమా తారలకి, క్రికెట్ ఆటగాళ్ళకి, పేరుపొందిన వ్యాపారస్తులకి ఆస్త్‌మా ఉంది, కాని వారెవ్వరూ దానిని తమ విజయం యొక్క మార్గానికి అడ్డురానీయలేదు. అందుకే, ఆస్త్‌మాకి మీ యొక్క లేదా మీకు కావలసిన వారి యొక్క జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించనీయకుండా ఆపే హక్కు లేదు.

పైకి తిరిగి వెళ్లు











  ఆస్త్‌మా యొక్క లక్షణాలు


ఆస్త్‌మా యొక్క సాధారణమైన లక్షణాలు ఈ క్రింద ఉన్నాయి:
ఛాతిలో బిగుతుగా ఉండడం: ఎవరో ఛాతిని నలుపుతున్నట్లు లేదా ఛాతిపై కూర్చున్నట్లు, ఛాతిలో నొక్కుతున్న అనుభూతి.
ఊపిరి అందకపోవడం: ఊపిరి అందకపోవడం అంటే అవసరమైనంత గాలి మీ ఊపిరితిత్తుల లోపలకి మరియు బయటకి అందకపోవడం. ముఖ్యంగా శ్వాస బయటకు వదలడం ఎంతో కష్టం.
ఆగని దగ్గు: ఎప్పటికీ తగ్గని దగ్గు, దగ్గు తరచుగా రాత్రుళ్ళు రావడం లేదా వ్యాయామం తరువాత.
పిల్లికూతలు: శ్వాసని బయటకు వదిలేటప్పుడు పిల్లికూత శబ్ధం వినిపించడం.

ఇతర లక్షణాలు:
రాత్రి నిద్ర దగ్గు వల్ల భంగం అవ్వడం

దయచేసి గమనించండి: ఆస్‌్గమా యొక్క లక్షణాలు ప్రతి వ్యక్తికి వేర్వేరుగా ఉంటాయి. ఒకరికి అన్ని లక్షణాలు ఉంటే మరొకరికి కేవలం దగ్గు లేదా పిల్లికూతలు మాత్రమే ఉండవచ్చును. మీకు ఉన్న లక్షణాలను దగ్గరగా గమనించి, మీ డాక్టర్‌తో విచారించి, మీ పరిస్థితి యొక్క రోగనిర్ధారణ సరిగ్గా చేయడానికి తోడ్పడండి. సరైన చికిత్సతో మీరు మీ ఆస్త్‌మా లక్షణాలని నియంత్రించగలరని గుర్తుంచుకోండి.

పైకి తిరిగి వెళ్లు












  ఆస్త్‌మా రోగ నిర్థారణ


ఆస్త్‌మాను ఎలా రోగ నిర్థారణ చేయాలి? 

మీరు ప్రేమించేవారికి ఆస్త్‌మా ఉన్నట్లు కనుగొంటే, మీరు ఆందోళన పడనఖ్ఖరలేదు. మీరు కంగారుపడవలసిన అవసరం లేదు, మరియు మీ ఉద్యోగం లేదా మీ నగరం మారవలసిన అవసరం లేదు. ఒలంపిక్ ఆటగాళ్ళకి ఆస్త్‌మా ఉంది, ప్రసిద్ధికెక్కిన క్రికెటర్లకి ఆస్త్‌మా ఉంది, సినిమా తారలకి ఆస్త్‌మా ఉంది, నేతలకి ఆస్త్‌మా ఉంది, కాని వీరెవ్వరు దానిని తమ దైనిక జీవితానికి అడ్డురానీయలేదు.

ఆస్త్‌మాని నియంత్రించడానికి సరైన మార్గం మీ ట్రిగ్గర్స్‌ని అర్థం చేసుకోవడమే, మీ లక్షణాల గురించి జాగ్రత్త పడడం, మరియు మీ మందులు సరిగ్గా తీసుకొనడం. కాని ముందు దానిని సరిగ్గా నిర్ధారించాలి.

భారతదేశంలో, చాలా మంది తల్లితండ్రులు తమ బిడ్డకి ఆస్త్‌మా ఉందని అంగీకరించరు. తమ బిడ్డకి ‘ఆస్త్‌మా’ అనే పదం బదులు కేవలం ‘వీజింగ్ బ్రోంకైటిస్’ లేదా ‘ఎలర్జిక్ బ్రోంకైటిస్’ ఉందని వారు వినడానికి ఇష్టపడతారు. వారు ఒక డాక్టర్ నుండి మరొక డాక్టర్ దగ్గరికి వెళ్ళి, తమకి మరియు తమ బిడ్డకి కూడా ఎంతో ఒత్తిడి కలిగించుకుంటారు, కాని నిజానికి ఆస్త్‌మాని త్వరగా కనిపెట్టి, దానికి త్వరగా చికిత్స చేస్తే, వారి బిడ్డ మామూలు జీవితాన్ని త్వరగా సాగించగలరు. . పిల్లలు పిల్లల లాగే ఉండాలి మరియు ఆస్త్‌మా ఉన్న పిల్లవాడు కూడా సరైన చికిత్స ఇస్తే మామూలు పిల్లవాడు చేసేవి అన్ని చేయగలడు - స్కూలుకి రోజూ వెళ్ళడం, ఆటలు ఆడడం, ఇంకా, ఐస్‌క్రీమ్ కూడా తినవచ్చు!

ఆస్త్‌మాని సులభంగా కనిపెట్టవచ్చు కాని అప్పుడప్పుడు దానిని మళ్ళీ మళ్ళీ వచ్చే దగ్గుగా అపోహపడి, దానిని అశ్రద్ధ చేసి లేదా సమయానికి చికిత్స చేయకుండా లేదా దగ్గు మందులతో చికిత్స చేస్తారు. చాలా సార్లు, ఆస్త్‌మా వంశపారంపర్యంగా వస్తుంది. మీ యొక్క లేదా మీ బిడ్డ ఆస్త్‌మాని నిర్ధారించడానికి మీ డాక్టర్‌కి సహాయపడడానికి, మీరు మీ డాక్టర్‌ అడిగే ప్రశ్నలకి సరైన సమాధానాలని ఇవ్వాలి. ప్రశ్నలు మీ లక్షణాల గురించి, మీ వంశచరిత్ర గురించి, మీరు తీసుకుంటున్న మందుల గురించి, మీకు ఉన్న అలర్జీలు మొదలైనవి ఉండవచ్చు. దీనిని మెడికల్ హిస్టరీ (వైద్య చరిత్ర ) అని అంటారు. చాలా నిర్ధారణ మెడికల్ హిస్టరీపై ఆధారపడి ఉంటుంది. డాక్టర్ కూడా ఒక శారీరక పరీక్ష చేసి ఆపై మిమ్మల్ని పీక్ ఫ్లో మీటర్ / (బ్రీతోమీటర్) మరియు స్పైరోమెట్రీ పరీక్షలని చేయించుకోమని మీకు సిఫారసు చేస్తారు.




పీక్ ఫ్లో మీటర్ (బ్రీతోమీటర్)

పీక్ ఫ్లో మీటర్ (బ్రీతోమీటర్) అనేది ఒక ఎక్కువ ఖరీదు కాని, సులభమైన, చేతితో పట్టుకుని వాడే పరికరం. దానితో పిల్లలు మరియు పెద్దలలో ఊపిరి పీల్చుకోవడంలో గల ఇబ్బందులు మరియు ఆస్త్‌మాని నిర్ధారించవచ్చు. మీరు ఆస్త్‌మా యొక్క చికిత్సని తీసుకునేటప్పుడు ఈ పరికరంతో మీ అభివృద్ధిని కూడా కొలవవచ్చు.

మీకు రక్తపోటు కొలవడానికి బిపి పరికరం మరియు మధుమేహం కొలవడానికి గ్లూకోమీటర్ ఉన్నట్లు పీక్ ఫ్లో మీటర్ (బ్రీతోమీటర్) ఆస్త్‌మా కోసం ఒక థర్మామీటర్ వంటిది. మీరు రోగి అయితే ఆ పరికరం మొదలులోకి గాలిని ఊదితే, మీ ఊపిరితిత్తుల బలాన్ని తనిఖీ చేయడానికి రీడింగ్ తీసుకోబడుతుంది. చాలామంది డాక్టర్‌లు తమ క్లినిక్‌లో ఆ పరికరాన్ని పెట్టుకుంటారు కాని మీరు మీ ఆస్త్‌మాని నియంత్రించాలని అనుకుంటే, దానిని మీరు పెద్ద మందుల దుకాణాల్లో కొనుక్కోవచ్చు.

మీకు ఆస్త్‌మా ఉంటే మీరు పీక్ ఫ్లో మీటర్ (బ్రీతోమీటర్) ఉపయోగించి మీ స్థితి మెరుగవుతోందో లేదో తెలుసుకోవచ్చు. మీ డాక్టర్ మీకు పీక్ ఫ్లో మీటర్ (బ్రీతోమీటర్) పైనున్న సంఖ్యని లేదా రీడింగ్‌ని చూపించి, మీ వయస్సు మరియు ఎత్తు ప్రకారం మీకు మంచిదో కాదో చెప్పగలరు. మీ రీడింగ్ మరీ తక్కువగా ఉంటే, దాని అర్థం మీ ఆస్త్‌మా నియంత్రించబడలేదని మరియు మీకు దగ్గరలో అంటే కొన్ని రోజులలోనే ఎటాక్ రాగలదు. అది ఒక ముందుగానే వచ్చే సంకేతం లాంటిది, మరియు దాన్ని బట్టి మీరు మీ మందు యొక్క మోతాదును పెంచాలో లేదా ఎన్ని సార్లు ఎక్కువ చేయాలో తెలుపుతుంది. ముందుసారి రీడింగ్ కన్నా సంఖ్య ఎక్కువగా ఉంటే, దాని అర్థం మీ ఆస్త్‌మా నియంత్రించబడిందని మరియు మీరు మెరుగుపడుతున్నారు. పీక్ ఫ్లో మీటర్ (బ్రీతోమీటర్) రీడింగ్ మామూలుగా ఉంటే (మీ డాక్టర్ మీకు ఆ రీడింగ్ తెలియచేస్తారు), ఇది మీ ఆస్త్‌మా నియంత్రించబడిందని సూచిస్తుంది.





స్పైరోమెట్రీ పరీక్ష

స్పైరోమెట్రీ పరీక్ష అనేది ఆస్త్‌మా చిహ్నాలని త్వరగా కనుగొనే ఎంతో సున్నితమైన మరియు అధునాతనమైన పరీక్ష. మీ ఊపిరితిత్తులు ఎంత గాలిని ఉంచుకోగలవో మరియు మీ ఊపిరితిత్తులు లోపలికి మరియు బయటకి ఎంత గాలిని వదలగలవో కొలవడానికి స్పైరోమీటర్ ఉపయోగించబడుతుంది. మరొక విధంగా చెప్పాలంటే, ఇది మీ ఊపిరితిత్తుల సమర్థత గురించి చక్కని సూచనను ఇస్తుంది మరియు మీకు మీ ఉచ్ఛ్వాసం యొక్క సమర్ధత గురించి ఖచ్చితమైన వివరాలను ఇస్తుంది. పరీక్షని చేస్తున్న డాక్టర్ లేదా లాబ్ మీరు ECG పరీక్షని చేయించుకున్నప్పుడు ఇచ్చే ముద్రించిన గ్రాఫ్ లాంటి, మీ రీడింగ్ ఉన్న గ్రాఫ్‌ని మీకు ఇస్తారు.

పీక్ ఫ్లో మీటర్ (బ్రీతోమీటర్) మరియు స్పైరోమెట్రీ పరీక్షలు, ఈ రెండు ఆస్త్‌మాని నిర్ధారించడానికి ఉపయోగించబడతాయి మరియు మీ ఆస్త్‌మా మెరుగుపడుతున్నప్పుడు మీ స్థితిని కొలవడానికి కూడా సహాయపడతాయి.

కాని ఈ పరీక్షలు ఆరేళ్ళు నిండని పిల్లలకి సిఫారసు చేయబడలేదు, అందుకే మీరు పేరంట్‌గా మీ కుటుంబ చరిత్ర మరియు ట్రిగ్గర్స్ దృష్టిలో ఉంచుకొని మీ బిడ్డ యొక్క ఆస్త్‌మా త్వరగా మరియు సరిగ్గా నిర్ధారించడానికి మీ పిడియాట్రీషన్‌తో కలిసి పని చేయాలి. ఇంతేకాక మీరు మీ బిడ్డ యొక్క స్థితిని పర్యవేక్షించడానికి మీ డాక్టర్‌ని క్రమం తప్పకుండా సంప్రదించడం కూడా అవసరం.

పైకి తిరిగి వెళ్లు














  ఆస్త్‌మా ట్రిగ్గర్స్ మరియు వాటిని తప్పించుకోవడం


ఒక ట్రిగ్గర్ అంటే ఊపిరితిత్తుల వాయునాళాల్లో చికాకు కలిగించి ఆస్త్‌మా లక్షణాలు కలిగించేది. ప్రతి ఒక్కరికి ఆస్త్‌మా వేరుగా ఉంటుంది మరియు ఆస్త్‌మాకి కారణమైయ్యే ట్రిగ్గర్స్ ఒకటి కంటే ఎక్కువే ఉంటాయి. దుమ్ము యొక్క రేణువుల దగ్గర నుండి పెంపుడు జంతువులు మరియు పుప్పొడి వరకు ట్రిగ్గర్స్ ఏవైనా అవ్వచ్చు. మీ ట్రిగ్గర్స్ ఏవో తెలుసుకొని వాటిని తప్పించుకోడానికి మీరు ప్రయత్నించాలి. అప్పుడే ఆస్త్‌మాని మీరు నియంత్రించి మామూలు జీవితాన్ని జీవించగలరు.

మీకు ఇబ్బంది కలిగించే ట్రిగ్గర్‌ను పోల్చుకోవడం కష్టం అవ్వచ్చు కాని అప్పుడప్పుడు సూచనలు ఎంతో స్పష్టంగా ఉంటాయి. ఉదాహరణకి: మీ లక్షణాలు మీరు ఒక పిల్లి లేదా కుక్క లేదా ఒక పక్షికి దగ్గరగా వచ్చిన కొన్ని నిమిషాలలో ప్రారంభం అవ్వచ్చు. లేదా గాలి టపాకాయల పొగతో కలుషితం అయినప్పుడు మీ లక్షణాలు ప్రారంభం అవ్వచ్చు. లేదా మీ వాయునాళాలను ఇబ్బంది పెట్టే ఏదో ఒక దానికి ఎలర్జీ ఉండి మీకు ఎటాక్ కలిగిస్తుండవచ్చు.

ఆస్త్‌మా మొదలవ్వడానికి అతి సామాన్యమైన కారణాలు ఏమిటంటే గాలి పీల్చేటప్పుడు వాతావరణంలోనున్న కొన్ని పదార్థాలు అంటే, ఇంట్లో డస్ట్ మైట్స్, సిగరెట్ పొగ, రసాయనాలతో ఉద్యోగ ప్రదేశంలో పని చేసేటప్పుడు (ఉదాహరణకి బొగ్గు, సిమెంట్, పెయింట్, యాస్బెస్టాస్, గని, పంచదార, రసాయనాల కర్మాగారాలలో), వాతావరణంలో గల కలుషితం మరియు బయట ఉండే పుప్పొడి లాంటి ఎలర్జిన్‌లు. ఎక్కువ ఇరుకు ప్రదేశాలలో జీవించే వారికి, తడి గోడలు మరియు కొయ్యల పొయ్యితో వంటచేసేవారికి ఆస్త్‌మా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.

ఆస్త్‌మా ఎటాక్‌ని తప్పించుకోడానికి కొన్ని సాధారణమైన ట్రిగ్గర్స్ మరియు పనికొచ్చే చిట్కాలు ఈ క్రింద ఉన్నాయి.

House dust mites
ఇంట్లో డస్ట్ మైట్స్
Pets
పెంపుడు జంతువులు
Smoking and air pollutants
పొగతాగడం మరియు గాలి కలుషితాలు
Your occupation / workplace
మీ వృత్తి/ఉద్యోగ ప్రదేశం
Colds and viruses
జలుబులు మరియు వైరస్లు
Emotions
ఉద్రేకాలు
Exercise
వ్యాయామం
Food
ఆహారం
Hormones
హార్మోన్లు
Medicines
మందులు
Molds, fungus and pollen
బూజు, శిలీంధ్రం మరియు పుప్పొడి
Weather
వాతావరణం
Mosquito coils, room fresheners, cleaning products
మస్కిటో కాయిల్స్, రూమ్ ఫ్రెషనర్లు, శుభ్రం చేసే ఉత్పత్తులు
 






ఇంట్లో డస్ట్ మైట్స్:
డస్ట్ మైట్స్ అతి సామాన్యమైన ట్రిగ్గర్స్. అవి తివాచీలు, పరుపులు, సోఫాలు, కర్టెన్లు, చివరికి దూది బొమ్మలలో కూడా నివసించే సూక్ష్మ క్రిములు.

పనికివచ్చే చిట్కాలు: తివాచీల వాడుక మానివేయండి మరియు ఎవరితోనైనా వాటిని నియమానుసారంగా శుభ్రం చేయించండి. మీకు ఆస్త్‌మా ఉంటే, మీరు ఇంటిని మరొకరితో శుభ్రం చేయించండి లేదా మీరు ఇంట్లో లేనప్పుడు ఇంటిని శుభ్రం చేయించండి. మీ బిడ్డకి ఆస్త్‌మా ఉంటే, వారు పాఠశాలలో ఉన్నప్పుడు ఇంటిని శుభ్రం చేయండి.
పరుపుల మీద ఉన్న అన్ని దూది బొమ్మలని తొలగించండి.

దూదితో చేసిన ఆటవస్తువులను ప్రతి రెండు వారాలకి ఒకసారి ఉతకండి.

House dust mites Pets Smoking and air pollutants Your occupation / workplace Colds and viruses Emotions Exercise Food Hormones Medicines Molds, fungus and pollen Weather Mosquito coils, room fresheners, cleaning products
పైకి తిరిగి వెళ్లు
పెంపుడు జంతువులు:
సాధారణంగా పెంపుడు జంతువులు ఆస్త్‌మా యొక్క లక్షణాలు కలుగజేస్తాయి. వాటి బొచ్చు, ఈకలు, ఉమ్ము, చర్మం పొరలు, లేదా మూత్రం ఆస్త్‌మా యొక్క లక్షణాలు కలిగించవచ్చు.

పనికివచ్చే చిట్కాలు: బొచ్చు మరియు ఈకలు ఉన్న పెంపుడు జంతువులని దూరంగా ఉంచండి. వాటిని మీరు నివశించే ప్రధానమైన మరియు నిద్రపోయే ప్రదేశాల నుండి కూడా దూరంగా ఉంచండి.

మీకు పెంపుడు జంతువులు కావాలంటే, చేపలని పెంచుకోండి.

House dust mites Pets Smoking and air pollutants Your occupation / workplace Colds and viruses Emotions Exercise Food Hormones Medicines Molds, fungus and pollen Weather Mosquito coils, room fresheners, cleaning products
పైకి తిరిగి వెళ్లు
పొగతాగడం మరియు గాలి కలుషితాలు:
చాలా సార్లు, మనం ఆస్త్‌మా లక్షణాలు కలిగించే కలుషితమైన గాలిని పీల్చుకుంటాము. సిగరెట్ పొగ, కారులో నుండి వచ్చే కాలుష్యం, టపాకాయల పొగ, పుల్లల పొయ్యి యొక్క పొగ...వీటన్నిటిలో వాయునాళాలని చికాకుపెట్టే రకరకాల పదార్థాలు ఉంటాయి.

పనికివచ్చే చిట్కాలు: మీకు ఆస్త్‌మా ఉంటే పొగతాగడం మానివేయండి. పొగ తాగడం మీ ఆరోగ్యానికి ఎంతో హానికరం. మీ చుట్టుప్రక్కల పొగతాగే వారిని మర్యాదగా పొగతాగవద్దని చెప్పండి, ఎందుకంటే పొగతాగేవారి దగ్గరగా ఉండడం కూడా మీకు మంచిది కాదు.
మీ ఇంటిలోవారు పొగతాగితే, వారిని ఆరుబయటకు వెళ్ళి పొగతాగమని చెప్పండి, ఎందుకంటే సిగరెట్ పొగ కర్టెన్లు, తివాచీలు మరియు ఇతర సామానుపై ఉండే గుడ్డ కవర్లపై చాలా సేపు చిక్కుకొని ఉంటుంది.

కాలుష్యం ఎక్కువగా ఉన్న సమయాలలో ప్రయాణం చేయవద్దు.

House dust mites Pets Smoking and air pollutants Your occupation / workplace Colds and viruses Emotions Exercise Food Hormones Medicines Molds, fungus and pollen Weather Mosquito coils, room fresheners, cleaning products
పైకి తిరిగి వెళ్లు
మీ వృత్తి/ఉద్యోగ ప్రదేశం:
అప్పుడప్పుడు, మీ ఉద్యోగం లేదా ఉద్యోగం చేసే ప్రదేశం ఒక ట్రిగ్గర్ అవ్వచ్చు. నగల వ్యాపారం చేసేవారు, ముద్రణ, పెస్టిసైడ్, క్వారీలు, పెయింటింగ్ మరియు ప్లాస్టిక్ కార్మాగారాలు, చెఫ్‌లు మరియు బేకర్‌లు, సోల్డరింగ్ పనిచేసేవారు మరియు లోహంతో పనిచేసేవారు, ఫోమ్‌తో పనిచేసేవారు మరియు స్ప్రే పెయింటర్లు, మంగలివారు మరియు వడ్రంగులు, ఆస్త్‌మాకి ఎక్కువగా గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. బహుశా, కొన్ని రసాయనాల వాసన లేదా కొన్ని పదార్థాలు ఊపిరితిత్తులలో ఇబ్బంది కలిగించడానికి కారణం అయి ఉండవచ్చు.

పనికివచ్చే చిట్కాలు: అవసరమైన జాగ్రత్తలు తీసుకొని, మీ కంట్రోలర్‌ని సరిగ్గా నియమానుసారంగా తీసుకొని, మరియు మీకు సరైన సలహా ఇచ్చే డాక్టర్‌ని సంప్రదించండి.

House dust mites Pets Smoking and air pollutants Your occupation / workplace Colds and viruses Emotions Exercise Food Hormones Medicines Molds, fungus and pollen Weather Mosquito coils, room fresheners, cleaning products
పైకి తిరిగి వెళ్లు
జలుబులు మరియు వైరస్లు:
జలుబు మరియు వైరల్ ఇన్ఫెక్షన్లు ఆస్త్‌మా యొక్క అతి సామాన్యమైన ట్రిగ్గర్స్. ప్రతి ఒక్కరు ఎప్పుడోకప్పుడు జలుబుతో బాధపడతారు, దానిని తప్పించుకోవడం ఎవరి తరం కాదు.

పనికివచ్చే చిట్కాలు: ఆరోగ్యమైనవి తినండి, ధృడంగా ఉండండి. మీ చేతులని వీలైనన్ని సార్లు కడుక్కోండి. మీ ముఖాన్ని మీ వేళ్ళతో ముట్టుకోవద్దు.

House dust mites Pets Smoking and air pollutants Your occupation / workplace Colds and viruses Emotions Exercise Food Hormones Medicines Molds, fungus and pollen Weather Mosquito coils, room fresheners, cleaning products
పైకి తిరిగి వెళ్లు
ఉద్రేకాలు:
గాఢమైన ఉద్రేకాలు, ఒత్తిడి లేదా ఎక్కువ నవ్వడం వల్ల కూడా ఆస్త్‌మా యొక్క లక్షణాలు ప్రారంభమవ్వచ్చు.

పనికివచ్చే చిట్కాలు: మీ ఒత్తిడిని తగ్గించుకొని, జీవితాన్ని సౌమ్యంగా జీవించడానికి ప్రయత్నించండి.

House dust mites Pets Smoking and air pollutants Your occupation / workplace Colds and viruses Emotions Exercise Food Hormones Medicines Molds, fungus and pollen Weather Mosquito coils, room fresheners, cleaning products
పైకి తిరిగి వెళ్లు
వ్యాయామం:
ఆస్త్‌మా ఉన్న వారితో సహా అందరికి వ్యాయామం మంచిది. కాని కొంతమంది వ్యాయామం చేసేటప్పుడు ఇతరుల కన్నా ఎక్కువగా అలసిపోతారు. మీ ఆస్త్‌మా నియంత్రణలో ఉంటే, మీకు వ్యాయామం చేసేటప్పుడు ఏ సమస్యా ఉండదు. కొన్ని లక్షణాలు విపరీతంగా ఉన్నట్లయితే, మీ సమీపంలోని డాక్టర్‌ని సంప్రదించండి.

పనికివచ్చే చిట్కాలు: ఆస్త్‌మా ఉన్నవారికి ఉత్తమమైన వ్యాయామాలు, యోగ, ఈత కొట్టడం లాంటి క్రీడలు, హాకీ, క్రికెట్, ఫుట్‌బాల్ వంటివి, ఎందుకంటే వీటిలో నిరంతరం పరిగెట్టవలసిన అవసరం ఉండదు, పైగా ఆట మధ్యలో విరామాలు ఉంటాయి.

మీరు వ్యాయామం మొదలుపెట్టే ముందు లేదా ఒక జిమ్లో చేరే ముందు మీ కుటుంబ డాక్టర్‌ని సంప్రదించండి. మీరు వ్యాయామం మొదలుపెట్టే ముందు లేదా ఒక జిమ్లో చేరే ముందు మీ కుటుంబ డాక్టర్‌ని సంప్రదించండి. మీ రిలీవర్ లేదా రెస్కూవర్ మందుల గురించి మీ జిమ్ అధ్యాపకుడికి, లేదా మీ పాఠశాల ఆటల కోచ్కి మీ ఆస్త్‌మా గురించి చెప్పండి మీ మందులని, వాటిని వాడే విధానం రాసి ఉన్న చీటీని ఎల్లప్పుడు మీ దగ్గర ఉంచుకోండి. ఒక అదనపు రిలీవర్/రెస్కూవర్‌ని కూడా దగ్గర పెట్టుకోండి.

House dust mites Pets Smoking and air pollutants Your occupation / workplace Colds and viruses Emotions Exercise Food Hormones Medicines Molds, fungus and pollen Weather Mosquito coils, room fresheners, cleaning products
పైకి తిరిగి వెళ్లు
ఆహారం:
ఆస్త్‌మా ఉన్నవారు ప్రత్యేకమైన పథ్యం అనుసరించవలసిన అవసరం లేదు కాని కొంతమందికి గింజలు, గుడ్లు, చేపలు, ఆవు పాలు, గుల్ల చేప, ఈస్ట్ ఉత్పత్తులు, కొన్ని వంట రంగులు, ప్రిజర్వేటివ్‌లు, వైన్‌లు, ఫిజ్ ఉన్న పానీయాలు, ప్రొసెస్ చేసిన తిండి పదార్థాలకి ఎలర్జీ ఉండవచ్చు.

పనికివచ్చే చిట్కాలు: ప్రిజర్వేటివ్‌లు ఉన్న తినుబండారాలు మరియు ప్యాకేజి చేసిన కృత్రిమ తినుబండారాలని తినవద్దు. అలాగే మీ ఎలర్జిన్‌లలో గింజలు, గుడ్లు, ఆవు పాలు, గుల్ల చేప మరియు ఈస్ట్ ఉత్పత్తులు ఉన్నాయేమో తెలుసుకోండి. ప్యాకేజ్డ్ తినుబండారాలపై రాసి ఉన్న సూచనలను జాగ్రత్తగా చదవండి.

ఎలర్జీ పరీక్ష చేయించుకోవడం గురించి మీ డాక్టర్‌ని సంప్రదించండి.

House dust mites Pets Smoking and air pollutants Your occupation / workplace Colds and viruses Emotions Exercise Food Hormones Medicines Molds, fungus and pollen Weather Mosquito coils, room fresheners, cleaning products
Back to top
హార్మోన్లు:
అవును, హార్మోన్లు ఆస్త్‌మా యొక్క ట్రిగ్గర్స్ అవ్వచ్చు, ప్రత్యేకంగా ఆడవారిలో. కొందరు ఆస్త్‌మా తారుణ్య దశలో, బహిష్టు అయ్యే ముందు గర్భధారణ సమయంలో , మరియు రజోనివృత్తి సమయాలలో ఆస్త్‌మా లక్షణాలు అనుభవిస్తారు.

పనికివచ్చే చిట్కాలు: మీ హార్మోన్లు మీ ఆస్త్‌మా లక్షణాలను ట్రిగ్గర్ చేయగలవని మీరు అనుకుంటే మీ డాక్టర్‌ని సంప్రదించండి.

House dust mites Pets Smoking and air pollutants Your occupation / workplace Colds and viruses Emotions Exercise Food Hormones Medicines Molds, fungus and pollen Weather Mosquito coils, room fresheners, cleaning products
పైకి తిరిగి వెళ్లు
మందులు:
కొన్ని మందులు ఆస్త్‌మా లక్షణాలను ట్రిగ్గర్ చేయగలవు. వీటిలో ఇన్‌ఫ్లుయంజా, గుండె సమస్యలు, గ్లాకోమా లాంటి వ్యాధుల మందులు కూడా ఉన్నాయి.

పనికివచ్చే చిట్కాలు: మీ డాక్టర్‌ని సంప్రదించి వారికి ఎల్లప్పుడు మీరు ఏ మందులు వాడుతున్నారో చెప్పండి .

House dust mites Pets Smoking and air pollutants Your occupation / workplace Colds and viruses Emotions Exercise Food Hormones Medicines Molds, fungus and pollen Weather Mosquito coils, room fresheners, cleaning products
పైకి తిరిగి వెళ్లు
బూజు, శిలీంధ్రం మరియు పుప్పొడి:
పుప్పొడిని వదిలే పూల మొక్కలు ఆస్త్‌మా లక్షణాలని ట్రిగ్గర్ చేయవచ్చు. తడి గోడలు, తడి బట్టలు, తడి స్నానాల గదులు మరియు తోటలోనున్న కుళ్ళిన ఆకుల కుప్పలు వంటి వాటి మీద ఉన్న దుమ్ము నుండి దూరంగా ఉండాలి.

పనికివచ్చే చిట్కాలు: మీ ఇంటిలోకి గాలి, వెలుతురు బాగా వచ్చేటట్లు చూడండి. మీ ఇంట్లో గోడలు తడిగా ఉండకుండా చూడండి.

House dust mites Pets Smoking and air pollutants Your occupation / workplace Colds and viruses Emotions Exercise Food Hormones Medicines Molds, fungus and pollen Weather Mosquito coils, room fresheners, cleaning products
పైకి తిరిగి వెళ్లు
వాతావరణం:
వాతావరణంలో అకస్మాత్తు మార్పు, గాలి ఎక్కువగా వీచే రోజులు, తేమతో వేడిగా ఉన్న రోజులు కొంత మందికి ట్రిగ్గర్స్‌గా పనిచేస్తాయి.

పనికివచ్చే చిట్కాలు: పొగమంచు ఉన్న రోజులలో ప్రొద్దున్నే బయట నడవడానికి వెళ్ళవద్దు. గాలి ఎక్కువగా వీస్తున్నప్పుడు మీ ముఖానికి ఒక స్కార్ఫ్‌ని లేదా శుభ్రమైన గుడ్డ కట్టుకోండి. రెండు విపరీతమైన ఉష్ణోగ్రతలు ఉన్న ప్రదేశాల మధ్య వెనువెంటనే మారవద్దు మరియు ప్రయాణించవద్దు...ఒక ఏర్ కండిషన్డ్ గది నుండి బయట తేమతో వేడిగా ఉన్న పరిస్థితులలోకి వెళ్ళడం.

House dust mites Pets Smoking and air pollutants Your occupation / workplace Colds and viruses Emotions Exercise Food Hormones Medicines Molds, fungus and pollen Weather Mosquito coils, room fresheners, cleaning products
పైకి తిరిగి వెళ్లు
మస్కిటో కాయిల్స్, రూమ్ ఫ్రెషనర్లు, శుభ్రం చేసే ఉత్పత్తులు:
ఈ ఉత్పత్తులలోనున్న రసాయనాలు కొంతమందికి ట్రిగ్గర్స్ అవ్వచ్చు. నిజానికి, చెస్ట్ రీసర్చ్ ఫౌండేషన్, పూణే, ఇండియా, వారు చేసిన పరిశోధన ప్రకారం ఒక్క మస్కిటో రిపెల్లెంట్‌ని కాల్చడం వల్ల మీరు 75 నుండి 137 సిగరెట్ల వాయువు కాలుష్య పదార్థాలని ఎదుర్కున్నట్లునని చెప్పుతున్నారు!

పనికివచ్చే చిట్కాలు: దోమలని దూరంగా ఉంచడానికి వైర్ మెష్ మస్కిటో నెట్లను ఉపయోగించండి. గాఢమైన వాసన ఉన్న శుభ్రం చేసే ఉత్పత్తులని వాడకండి మరియు మీ గదులలో కృత్రిమమైన రూమ్ ఫ్రెషనర్లు వాడే బదులు, మీ గదులలోకి గాలి, వెలుతురు బాగా వచ్చేటట్లు చూడండి.

House dust mites Pets Smoking and air pollutants Your occupation / workplace Colds and viruses Emotions Exercise Food Hormones Medicines Molds, fungus and pollen Weather Mosquito coils, room fresheners, cleaning products
పైకి తిరిగి వెళ్లు

దయచేసి గమనించండి:
‘ముందు జాగ్రత్త ఉంటేనే మేలు…’అనే సామెతలో ఎంతో వివేకం ఉంది. మీకు ఆస్త్‌మా ఉంటే, మీ ట్రిగ్గర్స్‌పై ఎల్లప్పుడు నిఘా వేసి వాటిని తప్పించుకోవడం ఎంతో మంచిది. మీ ట్రిగ్గర్స్, లక్షణాలు మరియు చికిత్స గురించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే, ఎప్పుడూ మీ డాక్టర్‌ని సంప్రదించండి.










  దగ్గు గురించి మరింత తెలుసుకోండి


మీరు దగ్గినప్పుడు, మీ ఊపిరితిత్తుల నుండి చెడు పదార్థాలు మరియు చెడు స్రావాలు బయటికి నెట్టివేయబడతాయి. అందుకే దగ్గడం అనేది ఊపిరితిత్తులకి వ్యాధులు రాకుండా మీ దేహం చేసే సహజమైన పని.

కాని దగ్గు అప్పుడప్పుడు ఎంతో ఇబ్బంది కలిగిస్తుంది. దగ్గు మిమ్మల్ని ఎంతో అలసిపోయేటట్లు చేసి, మీ నిద్రకి కూడా భంగం కలిగిస్తుంది. మీ దగ్గు నిరంతరం మరియు విపరీతంగా ఉంటే, మీకు ఊపిరితిత్తులలో సమస్య ఉన్నట్లు సూచన.

దగ్గులు సాధారణంగా వాటి సమయాన్ని బట్టి వర్గీకరించబడతాయి. మీ దగ్గు 3 వారాల కన్నా తక్కువ ఉంటే, దానిని ఎక్యూట్ (విపరీతమైన) దగ్గు అని అంటారు. మీ దగ్గు 8 వారాల కన్నా ఎక్కువ ఉంటే, దానిని దీర్ఘకాలపు (ఎక్కువ కాలం ఉండే) దగ్గు అని అంటారు.

ఎక్యూట్ దగ్గు యొక్క కారణాలు:
వైరల్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ (జలుబు, ఇన్‌ఫ్లుయంజా)
వాయునాళంలో ఒక విదేశీ పదార్ధం

దీర్ఘకాలపు లేదా నిరంతరమైన దగ్గు యొక్క కారణాలు:
ఆస్త్‌మా
ఆస్త్‌మా, ప్రత్యేకంగా పిల్లలలో దీర్ఘకాలపు లేదా ఆగకుండా వచ్చే దగ్గుకి సామాన్యమైన కారణం. ఆస్త్‌మా-వల్ల వచ్చే దగ్గు నిరంతరం, మళ్ళీ మళ్ళీ వచ్చేది లేదా వాతావరణం బట్టి వచ్చేది కావచ్చు. అది అప్పర్ రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్ తరువాత రావచ్చు లేదా డస్ట్ మైట్స్, పెంపుడు జంతువులు, పొగతాగడం మరియు గాలిలో ఉండే కాలుష్యాలు, తడి మొదలైనటువంటి వివిధ ట్రిగ్గర్స్ వల్ల ఎక్కువ అవ్వచ్చు.
ఎలర్జిక్ రైనైటిస్ (నేసల్ ఎలర్జీ)
ఆస్త్‌మా ఉన్న ఎంతోమంది రోగులకి ఎలర్జిక్ రైనైటిస్ కూడా ఉంటుంది, ఎందుకంటే ముక్కు రెస్పిరేటరీ ట్రాక్ట్ యొక్క పొడిగింపు. సాధారణంగా మొదట ముక్కు తరువాత ఊపిరితిత్తులు ప్రభావితం అవుతాయి. ఎలర్జిక్ రైనైటిస్ అనేది కొన్ని లక్షణాల సమ్మేళనం, అది ఎవరైనా తమకి ఎలర్జీ ఉన్న దుమ్ము, ధూళి లేదా పుప్ఫొడి లాంటివి పీల్చినప్పుడు వస్తుంది. ఈ లక్షణాలు వాతావరణం బట్టి రావచ్చు లేదా సంవత్సరం పొడుగునా ఉండవచ్చు.

లక్షణాలు:
• చీవిడి కారే ముక్కు (నిరంతరంగా నీరు లాంటి చీవిడి ముక్కు నుండి కారడం)
• తుమ్ములు
• ముక్కులో అడ్డు (ఊపిరి పీల్చడం, వదలడం కష్టంగా ఉండటం)
• ముక్కులో దురద (ముక్కు, కళ్ళు లేదా అంగిలి దురద పెట్టడం)
• పోస్ట్ నేసల్ డ్రిప్ ( అంటే, ముక్కు నుండి నీరు లాంటి స్రావం గొంతులోకి కారడం) దురద పెట్టి, దగ్గుకి దారి తీయడం.
రిఫ్లక్స్ వ్యాధి (గ్యాస్ లేదా అసిడిటి)
ఆమ్లం రిఫ్లక్స్ అంటే జీర్ణాశయం నుండి ఆమ్లం వెనక్కి అన్నవాహిక (ఈసాఫేగస్) లోకి వెళ్తుంది (రిఫ్లక్స్‌లు) . ఇది ఒక ట్రిగ్గర్ లాగ పనిచేసి, నిరంతరం ఉండే చికాకు మరియు దగ్గుకి దారితీస్తుంది.
ఇన్‌ఫెక్షన్‌లు
ఎప్పుడూ ఉండే దగ్గు, క్షయ మరియు ఇతర నిరంతరం ఉండే ఊపిరితిత్తుల వ్యాధులకు సంబంధించినది. ఇది తరచూ ఛాతి నొప్పి, నిద్రా భంగం, బొంగురు గొంతు, మరియు కొంతమందికి కళ్ళు చీకట్లు కమ్మడం,వాంతులు మరియు మూత్రాశయంపై నిగ్రహం కోల్పోవడం వంటి వాటితో సంబంధముంది.

గమనిక: చాలా దగ్గు మందులలో తాత్కాలిక ఉపశమనం ఇచ్చి ఊపిరితిత్తుల సమస్యను కప్పివేసే హానికరమైన స్టిములెంట్లు ఎన్నో ఉంటాయని గుర్తుపెట్టుకోండి. మీరు కనుక 3 వారాలకు పైగా నిరంతరమైన దగ్గుతో బాధపడుతుంటే, మీ డాక్టర్‌ని సరైన వ్యాధినిర్ణయం మరియు చికిత్స కోసం సంప్రదించండి.

పైకి తిరిగి వెళ్లు