అలెర్జిక్ రినైటిస్

దేని గురించి

మీకు చుట్టూ దుమ్ము లేదా పొగ ఉన్నప్పుడు మీకు పదేపదే తుమ్ములు వస్తున్నట్లుగా కనుగొన్నారా? అవును అయితే, మీకు దీనికి ఎలర్జీ ఉండే సంభావ్యత ఎక్కువగా ఉంటుంది.

క్రిములు (వైరసులు మరియు బ్యాక్టీరియా) లాంటి హానికరమైనవాటిపై పోరడటానికి మరియు మిమ్మల్ని కాపాడుకోవడానికి మీ శరీరం యొక్క రక్షణ వ్యవస్థ (రోగనిరోధక వ్యవస్థ అని కూడా అంటారు) మీకు సహాయపడుతుంది. మీకు దేనికైనా ఎలర్జీ ఉందంటే, మొక్కలు మరియు చెట్లు నుంచి దుమ్ము లేదా పుప్పొడి మరియు కొన్నిసార్లు కొన్ని ఆహార వస్తువుల నుంచి పూర్తిగా హాని లేని దేని నుంచైనా మిమ్మల్ని కాపాడేందుకు మీ రోగ నిరోధక వ్యవస్థ ప్రయత్నిస్తోందని అర్థం. చర్మం, కళ్ళు మరియు ముక్కు లాంటి శరీరంలోని భాగాన్ని అయినా ఎలర్జీ ప్రభావితం చేయవచ్చు.

‘‘దేనికైనా మీకు ఎలర్జీ ఉందంటే, పూర్తిగా హాని లేని దేనినుంచైనా మిమ్మల్ని కాపాడేందుకు మీ రోగనిరోధక వ్యవస్థ ప్రయత్నిస్తోందని అర్థం.’’

ఎలర్జీలనేవి చాలా సామాన్యమైనవి మరియు ఎవరినైనా ప్రభావితం చేయవచ్చు. అయితే, మీ కుటుంబం సభ్యుల్లో ఎవరికైనా ఎలర్జీల చరిత్ర ఉంటే, మీకు ఎలర్జీ కలిగే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు.

ఎలర్జిక్ రైనిటిస్ అనేది ముక్కును ప్రత్యేకంగా ప్రభావితం చేసే ఎలర్జీని సూచిస్తోంది. మీకు ఎలర్జీగా ఉన్న దేనినైనా మీరు లోపలకు పీల్చినప్పుడు లక్షణాలు చూపించడం మొదలువుతుంది. వీటిని ఎలర్జెన్స్ అని అంటారు. అత్యంత సామాన్యమైన ఎలర్జెన్స్ ఇవి:

  • పుప్పొడి మరియు పొగలాంటి బయటి ఎలర్జెన్స్

  • దుమ్ము పురుగులు, పెంపుడు జంతువుల వెంట్రుకలు లేదా మలమూత్రాలు మరియు బూజు (ఫంగస్) లాంటి ఇండోర్ ఎలర్జెన్స్

  • సిగరెట్ పొగకు, పెర్ఫ్యూమ్స్, రసాయనాలు మరియు ఎగ్జాస్ట్ ఫ్యూమ్స్ లాంటి ఇతర ఇరిటెంట్స్

మరింత స్పష్టంగా చెప్పాలంటే, ఎలర్జిక్ రైనిటిస్ రెండు రకాలుగా ఉంటుంది- సీజనల్ మరియు ఏడాది పొడువునా ఉండేది.

సీజనల్ ఎలర్జిక్ రైనిటిస్ అంటే మీ లక్షణాలు సంవత్సరంలో కొన్ని కాలాల్లో మాత్రమే చూపించడం లేదా తీవ్రమవ్వడం. సంవత్సరంలో కొన్ని కాలాల్లో పుష్కలంగా ఉండే పుప్పొడి లాంటి ఏదైనా మీ ఎలర్జెన్ అయితే ఇది మరింత సామాన్యంగా కలుగుతుంది.

మరొక వైపు ఏడాది పొడువునా ఉండే ఎలర్జిక్ రైనిటిస్, సంవత్సరం అంతటా మీకు లక్షణాలు ఉన్నప్పుడు కలుగుతుంది. దుమ్ము, పొగ, దుమ్ము పురుగులు తదితర లాంటి, సంవత్సరం అంతటా ఉండే వాటికి మీకు ఎలర్జీ ఉన్నప్పుడు ఇది మరింత సామాన్యంగా ఉంటుంది.

Please Select Your Preferred Language