సిఓపిడి

కింది వాటి గురించి

క్రానిక్: ఇది దీర్ఘకాలికమైనది మరియు పోదు

అబ్ స్ట్రక్టివ్: ఊపిరితిత్తుల నుంచి గాలి ప్రవాహం పాక్షికంగా అవరోధించబడుతుంది

పల్మొనరి: ఊపిరితిత్తులకు వైద్య పదం

వ్యాధి: ఆరోగ్య సమస్య

 

నిపుణుల ద్రుష్టికోణం- ‘సిఒపిడిని ఏది ప్రేరేపించవచ్చు? సిఒపిడి ప్రేరేపకాల గురించిన అన్నిటినీ డా. మెహతా వివరిస్తున్నారు.’

 

సరళమైన భాషలో చెప్పాలంటే, సిఒపిడి అనేది శ్వాస తీసుకోవడాన్ని కష్టం చేసే, మరియు జాగ్రత్త వహించకపోతే, కాలంతో పాటు తీవ్రమయ్యే ఊపిరితిత్తుల సమస్య. సిఒపిడి వినడానికి భయంకరంగా ఉంటుంది కానీ, దీన్ని పరిష్కరించవచ్చు, కాబట్టి కంగారుపడకండి. తగిన చికిత్స మరియు మందులతో, మీరు మీ సిఒపిడిని పూర్తిగా నియంత్రణలో ఉంచవచ్చు మరియు మీ జీవన విధానాన్ని మెరుగుపరచవచ్చు. ఈ విధంగా, హైకింగ్ నుంచి డ్యాన్సింగ్ నుంచి ప్రయాణం వరకు మీరు ఆనందిస్తున్న ప్రతి ఒక్కదానినీ మీరు చేస్తూ ఉండొచ్చు. సిఒపిడి గురించి గుర్తుంచుకోవలసిన మరొక ముఖ్య విషయం ఉంది. ఇది అంటు వ్యాధి కాదు. కాబట్టి దీనితో బాధపడుతున్న ఒకని సాన్నిహిత్యంలో మీరు ఉన్న కారణంగా మీకు సిఒపిడి కలగదు.