ఆస్తమా

ఆస్తమా ఎటాక్

మీరు ప్రేరేపకాన్ని కాంటాక్టు అయినప్పుడు ఆస్తమా ఎటాక్ కలగవచ్చు. వాయుమార్గాల చుట్టూ ఉన్న కండరాలు ఆకస్మికంగా బిగుసుకుపోతాయి మరియు వాయుమార్గాల యొక్క లైనింగ్ చే కఫం ఎక్కువగా స్రవిస్తుంది. ఈ అంశాలన్ని మీ లక్షణాలు ఆకస్మికంగా తీవ్రమయ్యేలా చేస్తాయి. ఆస్తమా ఎటాక్ యొక్క
లక్షణాలు ఇవి:
 శ్వాసతీసుకోలేకపోవడం
 తుమ్ములు
 తీవ్ర దగ్గు
 ఛాతీ బిగుసుకుపోవడం
 ఆత్రుత
లక్షణాలను ముందుగానే గుర్తించడం ద్వారా, మీరు ఆస్తమా ఎటాక్‌ని ఆపవచ్చు, లేదా అది తీవ్రతరం
కాకుండా నిరోధించవచ్చు. తీవ్ర ఆస్తమా ఎటాక్ ప్రాణాలకు ముప్పు కలిగించే అత్యవసరం కావచ్చు.

ఆస్తమా ఎటాక్ సమయంలో ఏం చేయాలి?
మీరు మీ కంట్రోలర్ ఇన్హేలర్ మందులను క్రమంతప్పకుండా తీసుకుంటే, మీకు ఆస్తమా ఎటాక్‌లు కలిగే
అవకాశం చాలా తక్కువ. మీకు లేదా మీ చుట్టూ ఉన్న ఎవరికైనా ఆస్తమా ఎటాక్ కలిగినప్పుడు
చేయవలసిన మొట్టమొదటి పని మౌనంగా మరియు రిలాక్స్ గా ఉండటం, మరియు ఈ స్టెప్స్ ని
నపాటించండి.
 నిటారుగా కూర్చోండి మరియు మీ దుస్తులు లూజు చేయండి
 మీకు నిర్దేశించిన రిలీవర్ ఇన్హేలర్ ని ఎలాంటి జాప్యం లేకుండా తీసుకోండి
 రిలీవర్ ఇన్హేలర్ ని ఉపయోగించిన తరువాత 5 నిమిషాల్లో మీకు ఉపశమనం లేకపోతే, మీ డాక్టరు
నిర్దేశించినట్లుగా రిలీవర్ ఇన్హేలర్ యొక్క ఇతర మోతాదులు తీసుకోండి.
 ఇప్పటికీ ఉపశమనం లేకపోతే, మీరు మీ డాక్టరుకు కాల్ చేయడం లేదా ఎలాంటి జాప్యం
లేకుండా సమీపంలో ఉన్న ఆసుపత్రిని సందర్శించడం ముఖ్యం. డాక్టరును సంప్రదించకుండా
రిలీవర్ ఇన్హేలర్ మోతాదును మించి తీసుకోకండి.

మీకు లేదా మీ చుట్టూ ఉన్న ఎవరికైనా ఈ కింది లక్షణాలు ఉంటే, సమీపంలో ఉన్న ఆసుపత్రిని వెంటనే
సందర్శించడం ముఖ్యం:

 పెదవులు, ముఖం, లేదా గోళ్ళు రంగు మారడం (నీలంరంగు లేదా బూడిద రంగు)
 శ్వాస తీసుకోవడంలో తీవ్ర కష్టం
 మాట్లాడటం మరియు నడవడంలో కష్టం
 శ్వాస తీసుకోవడంలో కష్టం వల్ల కలిగిన తీవ్ర ఆత్రుత లేదా భయం
 ఛాతి నొప్పి
 వేగంగా నాడి మరియు ముఖం పాలిపోవడం, చెమటపోయడం

ఆస్తమా ఎటాక్ తగ్గిపోయిన తరువాత, మీ ఆస్తమా కార్యాచరణ ప్లాన్ గురించి మీ డాక్టరును
సంప్రదించండి, దీనివల్ల మీరు మీ భవిష్యత్తు ఎటాక్ లన్నిటినీ నిరోధించవచ్చు.

Please Select Your Preferred Language