అలెర్జిక్ రినైటిస్

చికిత్స

ఎలర్జిక్ రైనిటైసిస్‌కి ఉత్తమ చికిత్స మీరు సాధ్యమైనంత ఎక్కువగా మీ ఎలర్జెన్స్ని ప్రయత్నించి, నివారించడమే.

ఎలర్జెన్స్ని ఎలా నివారించాలి

బయటి ఎలర్జెన్స్కి గురవ్వడాన్ని నిరోధించాలంటే, ఉదాహరణకు మీరు కింది ముందుజాగ్రత్తలు తీసుకోవచ్చు:

పుప్పొడి సీజనులో, మిట్టమధ్యాహ్నం మరియు సాయంత్రం లేదా బయట గాలి ఎక్కువగా ఉన్న సమయంలో ఇళ్ళల్లో/కార్యాలయాల్లో ఉండిపోండి, ఎందుకంటే గాలిలో పుప్పొడి కౌంట్లు సమయాల్లో సాధారణంగా ఎక్కువగా ఉంటాయి.

గార్డెనింగ్ చేసేటప్పుడు లేదా దుమ్ము గల ప్రదేశానికి వెళ్ళేటప్పుడు మాస్క్ ధరించండి.

బట్టలు మరియు టవల్స్ ని ఆరు బయట ఆరేయడానికి ప్రయత్నించకండి, ఎందుకంటే పుప్పొడి మరియు దుమ్ము వాటికి అంటుకుంటుంది.

మీరు బయట ఉన్నప్పుడు, మీ కళ్ళను కాపాడుకునేందుకు ఎల్లప్పుడూ చలువ కళ్ళద్దాలు/కళ్ళద్దాలు ధరించండి మరియు కళ్ళు రుద్దకండి; ఇలా చేస్తే కళ్ళు మండుతాయి మరియు మీ లక్షణాలను తీవ్రతరం చేయవచ్చు.

ఇళ్ళు/కార్యాలయంలో ఎలర్జెన్స్కి గురవ్వడాన్నినివారించేందుకు, ఉదాహరణకు మీరు కింది ముందుజాగ్రత్తలు తీసుకోవచ్చు:

కిటికీలను మూసివేయడానికి ప్రయత్నించండి మరియు మూసివుంచండి.

దుమ్ము దులపడానికి లేదా ఊడ్చడానికి బదులుగా, తడి గుడ్డతో లేదా మాప్ తో ఫ్లోర్లను శుభ్రం చేయండి.

బూజు మచ్చలు (ఫంగస్) ఏవైనా ఉంటే తొలగించేందుకు గోడలను క్రమంతప్పకుండా శుభ్రం చేయండి.

మీ దుప్పట్లు, దిండు కవర్లు మరియు బెడ్ షీట్లను తరచుగా వేడి నీటిలో ఉతకండి.

ఎప్పటికప్పుడు కార్పెట్‌ని మరియు కర్టెన్లను శుభ్రం చేయించండి.

మీకు దుమ్ము పురుగులు సోకడాన్ని తగ్గించేందుకు దిండ్లు, మ్యాట్రెస్ లు, కంఫర్టర్స్ తదితర లాంటి మీ అన్ని బెడ్డింగ్ కి మైట్ - ప్రూఫ్ కవర్స్ ని ఉపయోగించండి.

మీ ఇంట్లో తేమ స్థాయిలను సాధ్యమైనంత తక్కువగా ఉంచండి (మీరు డీ-హుమిడి ఫైర్ ని ఉపయోగించవచ్చు), దీనివల్ల బూజు వర్థిల్లదు.

బాత్ రూములు, కిచెన్లు, ఎట్టిక్స్ మరియు బేస్మెంట్లు లాంటి స్థలాలను క్రమంతప్పకుండా శుభ్రం చేయండి.

మీ కారు మరియు ఇంట్లో మీ ఎయిర్ కండిషనింగ్ యూనిట్ పరిశుభ్రంగా ఉందని నిర్థారించుకోండి.

పెంపుడు జంతువులకు మీకు ఎలర్జీ ఉంటే, కిందివి గుర్తుంచుకోండి-

మీరు పెంపుడు జంతువు దేనినైనా తాకిన తరువాత వెంటనే మీ చేతులు కడుక్కోండి.

పెంపుడు జంతువులు గల స్నేహితుడిని దర్శించిన తరువాత మీ బట్టలను బాగా ఉతకండి.

మీ ఇంటి పెంపుడు జంతువులను బయట ఉంచండి.

 

మందులు

మీ ఎలర్జిక్ రైనిటిస్ కి చికిత్స చేసేందుకు సహాయపడటానికి మీరు వివిధ మందులు కూడా ఉపయోగించవచ్చు. మీ లక్షణాల తీవ్రత మరియు రకాన్ని బట్టి, మీ డాక్టరు నాసల్ స్ప్రేలు, మాత్రలు, డ్రాప్స్, సిరప్ లు లాంటి మందులు మరియు ఇమ్యునోథెరపి లేదా మీకు ఎలర్జీ చాలా తీవ్రంగా ఉంటే ఎలర్జీ షాట్లు ప్రిస్క్రయిబ్ చేయవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా, ఎలర్జిక్ రైనిటిస్‌ కి చికిత్స చేసేందుకు ప్రభావవంతమైన మార్గంగా నాసల్ స్ప్రేలు విస్త్రుతంగా స్వీకరించబడుతున్నాయి.

నాసల్ స్ప్రేలు మందును నేరుగా సమస్యాత్మక ప్రాంతానికి, అంటే ముక్కులోకి విడుదల చేస్తాయి. మందు నేరుగా ముక్కులోకి వెళుతుంది కాబట్టి, దీని మోతాదు గణనీయంగా తక్కువగా ఉంటుంది, అంటే నాసల్ స్ప్రేలకు అతితక్కువ దుష్ప్రభావాలు ఉంటాయని అర్థం. మీరు మీ ఎలర్జిక్ రైనిటిస్‌ కి చికిత్స చేయించుకోవడం ముఖ్యం ఎందుకంటే దీనికి సకాలంలో చికిత్స చేయకపోతే, ఇది చెవి ఇన్ఫెక్షన్లు, సైనసైటిస్ మరియు నాసల్ పాలిప్స్ లాంటి సంక్లిష్ట సమస్యలకు దారితీయొచ్చు.

 

కుడి చేతి వైపు బ్యానర్లు

కుడి చేతి వైపు బ్యానర్ # 1 - పుష్పేంద్ర సింగ్ తన ఎలర్జిక్ రైనిటిస్ ని జయించారు మరియు మంచి జీవితం గడుపుతున్నారు. (స్ఫూర్తిదాయక కథ)

కుడి చేతి వైపు బ్యానర్ # 2 - ఎలర్జీ గల అందరికీ ఎలర్జిక్ రైనిటిస్ ఉంటుందా? (ఎఫ్ఎక్యూలు)

కుడి చేతి వైపు బ్యానర్ 3 – తమ శ్వాస సమస్యలను విజయవంతంగా అధిగమించిన ప్రజలతో కనెక్టు అయ్యేందుకు కమ్యూనిటిలో చేరండి (బ్రీత్ ఫ్రీ కమ్యూనిటి)

Please Select Your Preferred Language