ప్రేరణలు

జీవితం 2.0

యవ్వనంగా గురించిన విషయాన్ని ఇక్కడ ఇస్తున్నాము- ఇది సరదా మరియు భిన్న అనుభవం గురించినది. 20 లేదా 25 సంవత్సరాల తరువాత మనకు ఏం జరగబోతోందనే విషయం గురించి మనం ఆలోచించము. ఇక్కడే సమస్య ప్రారంభమైంది. నా జీవితాన్ని భవిష్యత్తులో ఎంత చెడుగా ప్రభావితం చేస్తుందనే విషయం తెలియకుండానే లేదా గ్రహించుకునే శక్తి లేకనో నేను ధూమపానం ప్రారంభించాను. ధూమపానం మానుకునేందుకు నేను అనేక సార్లు ప్రయత్నించాను, కానీ నేను ‘‘ధూమపానం అలవాటు గల స్వతంత్ర యంగ్ చాప్ ని అని అనుకునే వాడిని. ఇంతకంటే జరిగే తీవ్ర నష్టం ఏముంటుంది?’’

 

సమాధానం కేవలం నాలుగు అక్షరాలు- సిఒపిడి.

 

మనం విస్మరించగలిగినంతగా స్వల్పంగా శ్వాస తీసుకోలేకపోవడం లేదా దగ్గు తిరగబెట్టడం లాంటి లక్షణాలు స్వల్పంగా ప్రారంభమవుతాయి. వ్రుద్ధాప్యం యొక్క లక్షణాలు మాత్రమే అని నేను మొదట్లో అనుకున్నాను. కాబట్టి దాని గురించి నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ కాలం గడిచే కొద్దీ ఇది తీవ్రతరమవుతోంది. పచారీ సరుకుల కొనుగోలు లేదా వాష్ రూమ్ కి వెళ్ళడం లాంటి మామూలు పనులు చేసేటప్పుడు నాకు శ్వాస ఆడటం లేదు. పరిస్థితులు ఎంత దుర్లభంగా మారాయంటే నేను ఒంటరిగా వాష్ రూమ్ ని ఉపయోగించలేకపోతున్నాను. నాకు తెలిసిన మరొక విషయం ఏమిటంటే నేను మంచానపడ్డాను.

 

విభిన్న పరిష్కారాలు మరియు పనిచేయని ‘చికిత్సలు’ ప్రయత్నించిన తరువాత, నాకు తెలిసినందల్లా నా స్థితి గురించి నేను ఏదైనా చేయాలనే విషయం. డాక్టరును సంప్రదించేంత వరకు నాకు సిఒపిడి ఉందనే విషయమే తెలియదు. డాక్టరు మొదటిసారి దీన్ని నాకు చెప్పినప్పుడు, అతను కల్పించి చెబుతున్నారని అనుకున్నాను. నేను ఈ విషయం చెప్పినప్పుడు, ధూమపానం నా ఊపిరితిత్తులను మరియు వాయు మార్గాలను ఎలా ప్రభావితం చేసిందో మరియు సిఒపిడిని కలిగించిందో అతను వివరించారు.

 

నాకు ఇదే చివరి వరుస అనే విషయం నాకు ఖచ్చితంగా తెలిసింది. నేను కరెక్టు చికిత్స చేయించుకుంటే మరియు కొన్ని జీవన విధాన మార్పులు చేసుకుంటే సిఒపిడిని అదుపుచేయవచ్చని డాక్టరు నాకు చెప్పారు. నేడు, నేను ఎప్పటి మాదిరిగానే, స్వతంత్రం మరియు సంతోషకరమైన జీవితం గడుపుతున్నాను. నేను ధూమపానం మానుకున్నాను కాబట్టి మరియు సరైన చికిత్స చేయించుకుంటున్నాను కాబట్టి, నా సిఒపిడిని నియంత్రించేందుకు నేను సరైన ట్రాక్ లో ఉన్నానని నా డాక్టరు చెప్పారు.

 

 

ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళడం లేదా ఏదైనా తినడం గురించి నేను ఇంకెంత మాత్రం భయపడటం లేదు. నా మాదిరిగా, సిఒపిడి గల ప్రజలు ఇంతటితో ప్రపంచం ముగిసిపోలేదనే విషయం గ్రహిస్తారని మరియు సరైన రోగనిర్థారణ, చికిత్స మరియు జీవన విధానం మార్పులతో, మీరు కూడా ఆరోగ్యకరమైన మరియు క్రియాశీల జీవితం గడపవచ్చు.

Please Select Your Preferred Language