డిస్ క్లెయిమర్

శ్వాస వ్యాధుల గురించి సాధారణ సమాచారం ఇచ్చేందుకు ఈ వెబ్ సైట్ www.breathefree.com (‘‘వెబ్ సైట్’’) రూపొందించబడింది. ఇక్కడ ఇవ్వబడిన నియమ, నిబంధనలు ఈ వెబ్ సైట్ మరియు సమాచారం, వార్తలు మరియు టెక్స్ట్గ్, గ్రాఫిక్స్, ఇమేజిలు మరియు వెబ్ సైట్ లో గల ఏదైనా ఇతర మెటీరియల్ (‘‘సమాచారం’’) వాడకానికి వర్తిస్తాయి. కాబోవు రోగి లేదా వాళ్ళ బంధువులు/స్నేహితులు (‘‘యూజర్’’), మరియు వెబ్ సైట్ లో (‘‘సర్వీసు ప్రొవైడర్’’) కనిపిస్తున్న మెడికల్ లేదా హెల్త్ కేర్ ప్రాక్టీషనర్/ఆసుపత్రి/డయాగ్నస్టిక్ సెంటర్/కెమిస్టు దుకాణాలు తదితరులతో సహా ఈ వెబ్ సైట్ ను సందర్శించే యూజర్ ఎవరికైనా ఈ నియమ, నిబంధనలు వర్తిస్తాయి.

ఈ వెబ్ సైట్  లో ని విషయం సమాచారంగా మాత్రమే అందించబడుతుంది మరియు ఇది వేడుకోలు లేదా వైద్య సలహా కాదు. ఇక్కడ ఉన్న విషయాన్ని యూజర్ యొక్క పరిధిలో ప్రాక్టీస్ చేసేందుకు అధీకృతం ఇవ్వబడిన లైసెన్స్ గల హెల్త్ కేర్ ప్రొవైడర్ నుంచి వైద్య సలహా పొందడానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించకూడదు. వెబ్ సైట్ లో లేదా ఇతరత్రా వివరించిన లేదా ప్రిస్క్రయిబ్ చేసిన మందు, ఆహార అనుబంధకం లేదా చికిత్సను అతని/ఆమె ఫిజీషియన్ ని మొదటగా సంప్రదించకుండా యూజర్ తీసుకోకూడదు లేదా ప్రారంభించకూడదు. ఈ సైటులో ఇవ్వబడిన సమాచారంపై ఆధారపడిన ఏ వ్యక్తి విషయంలో కూడా సిప్లా బాధ్యత తీసుకోదు మరియు ఇలాంటి సమాచారానికి సంబంధించిన బాధ్యత క్లెయిమ్ మొత్తాన్ని వదులుకుంటోంది. లైసెన్స్ గల హెల్త్ కేర్ ప్రొవైడర్ నుంచి వైద్య సలహా కోరకుండా ఈ వెబ్ సైట్ లోని సమాచారంపై మీరు ఆధారపడకూడదు.

ఈ వెబ్ సైటు లోని సమాచారాన్ని మూల్యాంకనం చేయడంలో అతను/ఆమె తీసుకునే స్వీయ నిర్ణయానికి ప్రత్యామ్నాయంగా ఈ వెబ్ సైటులోని విషయాలను యూజర్ అనుమతించకూడదు. వెబ్ సైటులోని సర్వీసెస్ ప్రొవైడర్, వెబ్ సైటులో ఇవ్వబడిన సమయంలో అందుబాటులో ఉండకపోవచ్చని లేదా ఈ
వెబ్ సైటు తో వాళ్ళ అనుబంధాన్ని నిలిపివేయవచ్చని యూజర్ అంగీకరిస్తున్నారు.

ప్రాక్టీస్ చేయడానికి సంబంధిత చట్టబద్ధ అధికారుల నుంచి చెల్లుబాటయ్యే లైసెన్స్ (లు) మరియు రిజిస్ట్రేషన్ అతనికి/ఆమెకు/దానికి ఉందని హామీ ఇచ్చే మరియు వర్తించే చట్టాలన్నిటికీ కట్టుబడవలసిన బాధ్యత పూర్తిగా సర్వీసు ప్రొవైడరుదే. ఈ షరతును ఉల్లంఘిస్తే న్యాయపరమైన చర్య లేదా దీని నుంచి ఉత్పన్నమయ్యే ఇతర పర్యవసానాలకు సర్వీసు ప్రొవైడరును పూర్తిగా బాధ్యులుగా చేస్తుంది.

ఈ సైటులో తప్పులు లేదా వదిలేసినవి ఏవీ లేకుండా చూసేందుకు తగిన శ్రద్ధ మరియు జాగ్రత్త తీసుకున్నప్పటికీ, తీసుకున్న ఏదైనా చర్యకు, వ్యక్తపరచిన అభిప్రాయాలకు, ఇచ్చిన లేదా స్వీకరించిన సలహాకు, ఈ వెబ్ సైటులో ప్రచురించిన ఏదైనా మెటీరియల్ లేదా సమాచారం ఆధారంగా కలిగిన ఏవైనా ప్రత్యక్ష సందర్భోచిత, ప్రత్యేక లేదా పరిస్థితుల వల్ల కలిగిన నష్టానికి మరియు డేమేజికి ఏ విధంగానూ సిప్లా లిమిటెడ్ బాధ్యురాలు కాదు.

Please Select Your Preferred Language