ప్రైవసీ పాలసీ

ఈ వెబ్ సైట్ “www.breathefree.com”ని (ఇకపై ‘‘వెబ్ సైట్’’గా ప్రస్తావించబడుతుంది) ఉపయోగించడానికి లేదా యాక్సెస్ పొందడానికి ముందు ఈ ప్రైవసీ పాలసీ స్టేట్ మెంట్ ని జాగ్రత్తగా చదవవలసిందిగా మరియు సమీక్షించవలసిందిగా సిప్లా లిమిటెడ్ మిమ్మల్ని కోరుతోంది. మీరు ఈ వెబ్ సైట్ ని ఉపయోగించడానికి లేదా యాక్సెస్ పొందడానికి ముందుకెళితే, ఎలాంటి మినహాయింపులు లేకుండా, ఈ ప్రైవసీ పాలసీ స్టేట్ మెంట్ కి కట్టుబడటానికి మీరు అంగీకరిస్తున్నారు. మీరు ఈ ప్రైవసీ పాలసీ స్టేట్ మెంట్ కి మీరు అంగీకరించకపోతే మీరు ఈ వెబ్ సైట్ ని ఉపయోగించలేరు లేదా యాక్సెస్ పొందలేరు. ముందుగా నోటీసు ఇవ్వకుండానే ఏ సమయంలోనైనా ఈ సమాచారాన్ని కలపడానికి, తొలగించడానికి లేదా మార్చడానికి సిప్లా లిమిటెడ్, దాని సబ్సిడరీలు, దాని అనుబంధీకులు మరియు దాని గ్రూప్ కంపెనీలకు (ఇకపై ‘‘సిప్లా’’గా ప్రస్తావించడం జరుగుతుంది) హక్కు ఉంది.

వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారం సేకరణ

1. ఏదైనా వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారాన్ని దానంతటదే సేకరించేందుకు మరియు/లేదా అందుకునేందుకు వెబ్ సైట్ రూపొందించబడలేదు. మీరు వెబ్ సైటుకు యాక్సెస్ అయితే మరియు/లేదా వ్యక్తిగతంగా గుర్తించదగిన ఏదైనా సమాచారం ఇస్తే తప్ప సిప్లా మిమ్మల్ని వ్యక్తిగతంగా గుర్తించలేదు.

2. చురుకుగా సమాచార సేకరణ: ఈ వెబ్ సైటుల్లో డేటా ఫీల్డుల్లోకి మీరు నమోదు చేసిన వ్యక్తిగత సమాచారాన్ని సిప్లా సేకరిస్తుంది. ఉదాహరణకు, వివిధ విషయాల గురించి సమాచారం పొందడానికి మీరు మీ పేరు, పోస్టల్ చిరునామా, ఈమెయిల్ చిరునామా, మరియు/లేదా ఇతర సమాచారాన్ని సమర్పించవచ్చు. మీ ప్రైవసీని కాపాడేందుకు, ప్రత్యేకంగా అభ్యర్థించని సమాచారం దేనినీ మీరు సిప్లాకు ఇవ్వకూడదు.

3. పేసివ్ సమాచార సేకరణ: మీరు సమాచారాన్ని క్రియాశీలంగా సమర్పించకుండానే సిప్లా వెబ్ సైట్ లను మీరు చూడటం గురించిన సమాచారాన్ని సిప్లా వెబ్ సైట్లు సేకరించవచ్చు. కుకీలు, ఇంటర్నెట్ ట్యాగులు, మరియు వెబ్ బేకన్స్ లాంటి వివిధ టెక్నాలజీలను ఉపయోగించి ఈ సమాచారం సేకరించబడవచ్చు. మీరు ఇప్పుడే చూసిన
వెబ్ సైట్ యుఆర్ఎల్, ఇంటర్నెట్ ప్రొటోకాల్ (ఐపి) అడ్రసులు, జిపిఎస్ లొకేషన్ డేటా, మొబైల్ ఫోన్ సర్వీసు ప్రొవైడర్, ఆపరేటింగ్ సిస్టమ్ వివరాలు, మీ కంప్యూటర్ బ్రౌజర్ వెర్షన్ తదితర లాంటి ఈ సమాచారంలో కొంత వెబ్ సైట్ తీసుకోవచ్చు. పేసివ్ సమాచార సేకరణ టెక్నాలజీలు సిప్లా మెరుగైన సేవ, వినియోగదారుల ప్రాధాన్యతలు, సంకలన గణాంకాలు, విశ్లేషణ ధోరణులపై ఆధారపడి అనుకూలమైన సైట్లు, మరియు వెబ్ సైట్ ని ఇతరత్రా ఇచ్చే మరియు మెరుగుపరిచేందుకు అనుమతిస్తూ మీరు వెబ్ సైట్ ని సుఖమయంగా ఉపయోగించేలా చేయగలవు. 

ఈ టెక్నాలజీలు సేకరించే ఇలాంటి సమాచారాన్ని అదనపు గుర్తించదగిన సమాచారం లేకుండానే మిమ్మల్ని గుర్తించడానికి ఉపయోగించలేరు.

 

వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారాన్ని ఉద్దేశానికి ఉపయోగించుట

4. వెబ్ సైట్ ద్వారా మీరు ఇచ్చిన వ్యక్తిగత సమాచారాన్ని మీ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు, సమర్థవంతమైన కమ్యూనికేషన్ కలిగివుండేందుకు మరియు మీకు ప్రభావవంతమైన కస్టమర్ సర్వీసు ఇవ్వడానికి సిప్లా ఉపయోగిస్తుంది. మీరు వ్యక్తిగత సమాచారాన్ని వెబ్ సైటులో ఫారంలోకి లేదా డేటా ఫీల్డులోకి నమోదు చేసిన తరువాత, మీరు తరచుగా సందర్శించే వెబ్ సైట్ లోని సెక్షన్లు లాంటి మీ వ్యక్తిగత ప్రాధాన్యతలను ‘‘గుర్తుపెట్టుకునేందుకు’’ ఆ వెబ్ సైట్ ని అనుమతించడానికి సిప్లా కొన్ని గుర్తింపు టెక్నాలజీలను మరియు మీరు ఎంచుకుంటే, మీ యూజర్ ఐడిని ఉపయోగించవచ్చు.

5. వర్తించే చట్టాలు అన్నిటికి అనుగుణంగా సిప్లా మీ సమాచారాన్ని సేకరిస్తుంది, స్టోర్ చేస్తుంది మరియు ఉపయోగిస్తుంది. వెబ్ సైటులో ఫారాల్లో లేదా డేటా ఫీల్డుల్లోకి వ్యక్తిగత సమాచారం దేనినీ నమోదుచేయకపోవడాన్ని ఎంచుకోవడం ద్వారా, మీ గురించి సిప్లా అందుకున్న వ్యక్తిగత సమాచారం పరిమాణం మరియు రకాన్ని మీరు ఎల్లప్పుడూ పరిమితం చేయవచ్చు. మీరు మాకు సముచితమైన వ్యక్తిగత సమాచారాన్ని ఇస్తే మా ఆన్ లైన్ సర్వీసులు కొన్నిమాత్రమే మీకు ఇవ్వబడతాయి. మీకు ఆసక్తిగా ఉండే ఆఫర్లు, ప్రమోషన్లు మరియు అదనపు సర్వీసుల కోసం మీరు మా కాంటాక్టు జాబితాలోకి లేదా బయటకు ఎంచుకున్నారా అని వెబ్ సైట్ యొక్క ఇతర భాగాలు అడగవచ్చు. ఇలా చేయడాన్ని ఎంచుకుంటే, మార్కెటింగ్ మరియు ప్రమోషనల్ పనుల కోసం మేము ఈ సమాచారాన్ని ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, వర్తించే చట్టం మరియు మీ సమ్మతికి అనుగుణంగా, మీకు వార్తలు మరియు న్యూస్ లెటర్లు, ప్రత్యేక ఆఫర్లు, మరియు ప్రమోషన్లను మీకు పంపడానికి, మరియు మీకు ఆసక్తికరంగా ఉంటుందని మేము భావించిన సమాచారం లేదా ప్రొడక్టుల గురించి మిమ్మల్ని సంప్రదించడానికి మేము మీ ఈమెయిల్ చిరునామాను ఉపయోగిస్తాము.

 

స్పామింగ్

6. ‘‘స్పామింగ్’’కి సిప్లా మద్దతు ఇవ్వదు. స్పామింగ్ అంటే కోరని ఈమెయిల్స్ ని, సాధారణంగా వాణిజ్య స్వభావం కలవాటిని పెద్ద సంఖ్యలో మరియు పదేపదే, సెండరుకు గతంలో కాంటాక్టు లేని లేదా ఇలాంటి కమ్యూనికేషన్స్ ని అందుకోవడానికి నిరాకరించిన వ్యక్తులకు పంపడమని అర్థం. దీనికి భిన్నంగా, ఆసక్తి వ్యక్తపరిచిన సందర్శకులకు వాళ్ళు వ్యక్తపరిచిన ఏరియాకు సిప్లా ఎప్పటికప్పుడు ఈమెయిల్స్ పంపవచ్చు, అయితే ఇలాంటి సర్వీసును అందుకోకపోవడాన్ని మీరు ఎంచుకునే చాయిస్ మీకు కల్పిస్తుంది.

సమాచారాన్ని వెల్లడించకపోవడం

7. వెబ్ సైటులో గల వ్యక్తిగత సమాచారాన్ని సిప్లా, దీనితో ఉమ్మడిగా ప్రోగ్రాములు నిర్వహించే కొన్ని కంపెనీలు, మరియు సిప్లా కోసం వ్యాపార కార్యకలాపాలు చేసేందుకు సిప్లాకు కాంట్రాక్టులు గల వ్యక్తులు మరియు సంస్థలు పొందవచ్చు.

8. మీ వ్యక్తిగత సమాచారాన్ని మరెవ్వరికీ సిప్లా విక్రయించదు లేదా అద్దెకు ఇవ్వదు.

9. తన వ్యాపారానికి సంబంధించి లేదా మరింతగా ప్రాసెస్ చేసేందుకు అవసరమైతే, వ్యక్తిగత సమాచారాన్ని మూడవ  పక్షాలతో సిప్లా పంచుకోవచ్చు. ఈ సమయంలో పంచుకునే సమాచారం మూడవ పక్షంతో గల గోప్యత ఒప్పందానికి మరియు సమాచారం మొదట్లో సేకరించిన ఉద్దేశానికి వర్తించే చట్టానికి అనుగుణంగా ఉంటుంది మరియు ఇలాంటి మూడవ పక్షాలు అన్నీ సిప్లా వారి ప్రైవసీ పాలసీని పాటించేలా చూడటం జరుగుతుంది.

10. వర్తించే చట్టాన్ని పాటించడానికి కావలసినట్లుగా విడుదల చేయవలసిన అవసరం ఉందని మేము నమ్మితే మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని విడుదల చేయవచ్చు. సమీక్షించిన తరువాత, చట్టం లేదా రెగ్యులేషన్ మేరకు విడుదల చేయవలసి ఉంటుందని మేము భావిస్తే మేము వ్యక్తిగత ఆరోగ్య సమాచారాన్ని విడుదల చేయవచ్చు.

 

వ్యక్తిగత సమాచార రక్షణ

11. వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారాన్నికాపాడేందుకు తగినన్నిసాంకేతిక మరియు సంస్థాగత భద్రత చర్యలను సిప్లా నిర్వహిస్తుంది.

12. ఒక విధానంగా, వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే ప్రతి వెబ్ పేజీకి సిప్లా భద్రత కల్పిస్తుంది; అయితే, ఇంటర్నెట్ లో పంపిన వ్యక్తిగత సమాచార గోప్యతకు గ్యారంటీ ఇవ్వదు. ఇంటర్నెట్ లో వ్యక్తిగత సమాచారాన్ని పంపేటప్పుడు జాగ్రత్తగా ఉండవలసిందిగా మేము మిమ్మల్ని కోరుతున్నాము.

13. ఇలాంటి సమాచారం సేకరించిన లేదా సమర్పించిన లక్షిత ఉద్దేశానికి మించిన కాలానికి మీ సమాచారాన్ని స్టోర్ చేయవలసిన బాధ్యత సిప్లాకు లేదు.

 

ఇతర వెబ్ సైటులకు లింకులు

14. ఈ ప్రైవసీ పాలసీ సిప్లా వెబ్ సైటులకు వర్తిస్తుంది. ఇతర వెబ్ సైటులకు సిప్లా లింకులు ఏర్పాటు చేయవచ్చు, ఇది మీకు ఆసక్తి కలిగించవచ్చని మేము నమ్ముతున్నాము. ఇలాంటి వెబ్సైటులోని విషయానికి, ఇలాంటి వెబ్ సైట్ లింకులకు మీ ప్రవేశ సౌలభ్యం, మీరు ఇచ్చిన వ్యక్తిగత సమాచారం లేదా ఆ వెబ్ సైట్ సేకరించిన ఏదైనా సమాచారం భద్రతకు సిప్లా బాధ్యురాలు కాదు. ఇలాంటి వెబ్ సైటులకు ప్రవేశసౌలభ్యం పొందే ప్రమాదం మీదే.

మరొక బాహ్య వెబ్ సైటుకు హైపర్ లింకుపై మీరు క్లిక్ చేసినప్పుడు, ఆ కొత్త బాహ్య వెబ్ సైటుల ప్రైవసీ పాలసీకి మీరు లోబడి ఉంటారు. ఈ కొత్త బాహ్య వెబ్ సైటును మీరు బ్రౌజ్ చేసినప్పుడు, సిప్లా లిమిటెడ్ లేదా దాని డైరెక్టర్లు, ఏజెన్సీలు, ఆఫీసర్లు లేదా ఉద్యోగులు ఎవరైనా ఈ బాహ్య సైట్ ప్రచురించిన సమాచారం ఏదైనా ఖచ్చితత్వం, నమ్మకం లేదా కాలానుగుణతకు బాధ్యులు కారు, లేదా లింకు చేసిన ఏదైనా విషయం, అభిప్రాయాలు, ప్రొడక్టులు లేదా సర్వీసులను వాళ్ళు ఆమోదించరు మరియు ఇక్కడ ఇవ్వబడిన సమాచారం నిర్దుష్టత, నమ్మకం లేదా కాలానుగుణతపై ఆధారపడటం వల్ల కలిగిన ఏవైనా నష్టాలకు బాధ్యులను చేయకూడదు.

పిల్లలు మా వెబ్ సైటులను ఉపయోగించుట

15. తెలిసి వెబ్ సైటులో పిల్లల నుంచి (మేము ‘‘పిల్లలు’’ అంటే 18 సంవత్సరాల లోపు మైనర్లు అని అంటాము) ఏదైనా వ్యక్తిగత సమాచారాన్ని సిప్లా సేకరించదు లేదా ఉపయోగించదు. మాకు తెలిసినంత వరకు పిల్లలను మాతో కమ్యూనికేట్ చేసేందుకు, లేదా మా ఆన్ లైన్ సర్వీసులు వేటినీ ఉపయోగించడానికి మేము అనుమతించము. మీరు తల్లిదండ్రి అయితే మరియు మీ శిశువు మాకు సమాచారం ఇచ్చారనే విషయం మీకు తెలిస్తే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి మరియు ఈ సమస్యలను పరిష్కరించడానికి మేము మీతో పనిచేస్తాము.

వెబ్ సైటులో మీ వ్యక్తిగత సమాచారం పొందడానికి హక్కు ఉంది

16. మీకు మీరుగా వెబ్ సైటులో నమోదు చేసిన వ్యక్తిగత సమాచారాన్ని మీరు సమీక్షించాలనుకుంటే, మార్చాలనుకుంటే, కలపాలనుకుంటే లేదా తొలగించాలనుకుంటే, మీ ప్రొఫైలుకు లభించే ‘‘ఎడిట్’’ ఆప్షనును ఉపయోగించి మీరు ఇలా చేయవచ్చు. మీకు ఏదైనా సమస్య ఉంటే, మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు.

17. మీరు మాకు ఇచ్చిన వ్యక్తిగత సమాచారం వాడకం, సవరణ, లేదా డిలీట్ చేయడం గురించి మీకు ప్రశ్నలు ఉంటే, లేదా సిప్లా బిజినెస్ లేదా నిర్దిష్ట సిప్లా ప్రోగ్రామ్ నుంచి భవిష్యత్తులో మీరు కమ్యూనికేషన్లు అందుకోకూడదనుకుంటే, మీరు సందర్శించిన వెబ్ సైటుపై ‘‘కాంటాక్టు అజ్’’పై క్లిక్ చేయడం ద్వారా లేదా మాకు privacy@cipla.comకి ఈమెయిల్ చేయడం ద్వారా దయచేసి మమ్మల్ని సంప్రదించండి. ప్రత్యామ్నాయంగా, మీరు ఈ కింది చిరునామాకు లేఖ పంపవచ్చు.
చిరునామా:

అటెన్షన్ - లీగల్ డిపార్టుమెంట్ 

సిప్లా లిమిటెడ్, టవర్ ఎ, 1వ అంతస్తు, పెనిన్సులా బిజినెస్ పార్క్,

గణపతరావు కదమ్ మార్గ్, లోయర్ పరేల్, ముంబయి-400 013, ఇండియా

18. సిప్లాకు పంపే కమ్యూనికేషన్స్ అన్నిటిలోనూ, దయచేసి రిజిస్ట్రేషన్ కి ఉపయోగించిన ఈమెయిల్ అడ్రస్ (లభిస్తే), వెబ్ సైట్ చిరునామా మరియు మీ అభ్యర్థన యొక్క సవివరమైన వివరణను చేర్చండి. మీరు మీ వ్యక్తిగత సమాచారాన్ని తీసేయాలనుకుంటే లేదా సవరించాలనుకుంటే మరియు ఈమెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదిస్తుంటే, దయచేసి వర్తించినట్లుగా ఈమెయిల్ యొక్క సబ్జెక్టు లైనులో ‘‘డిలీషన్ రిక్వెస్ట్’’ లేదా ‘‘అమెండ్మెంట్ రిక్వెస్ట్’’ చేర్చండి. సహేతుకమైన అభ్యర్థనలు అన్నిటికీ మేము సకాలంలో చేయగలిగింది చేస్తాము.

 

పాలసీలో మార్పు

19. సాంకేతిక పురోగతులు, న్యాయపరమైన మరియు చట్టపరమైన మార్పులు మరియు మంచి వ్యాపార పద్ధతులను ప్రతిబింబింపజేసేందుకు ముందుగా నోటీసు ఇవ్వకుండా ఈ ప్రైవసీ పాలసీని సవరించడానికి సిప్లాకు హక్కు ఉంది. ఒకవేళ సిప్లా తన ప్రైవసీ పద్ధతులను మార్చితే, కొత్త ప్రైవసీ పాలసీలో ఈ మార్పులను చేర్చడం జరుగుతుంది మరియు సవరించిన ప్రైవసీ పాలసీ అమలులోకి వచ్చే తేదీని ఈ పేరాగ్రాఫులో పొందుపరచబడుతుంది.

20. ప్రైవసీ పాలసీ చివరిసారిగా 1వ అక్టోబరు 2017న అప్ డేట్ చేయబడింది మరియు ఆ తేదీ నుంచి అమలులోకి వచ్చింది.

 

Please Select Your Preferred Language