ఆస్తమా

ఆస్తమా రోగనిర్థారణ

ఏది ఆస్తమా మరియు ఏది తిరగబెట్టిన దగ్గు అనే విషయంలో తికమకపడటం చాలా సులభం, ఎందుకంటే రెండిటి లక్షణాలు ఒకేలా ఉంటాయి. కాబట్టి, వాస్తవ సమస్యకు తరచుగా తప్పుగా చికిత్స చేస్తుంటారు, లేదా అస్సలు చికిత్స చేయరు. అయితే, ఇది కంగారుపడవలసిన కారణం కాదు. ఎందుకంటే, ప్రారంభ దశలో మీరు ఆస్తమాను రోగనిర్థారణ చేయించుకోవచ్చు.

వైద్య చరిత్ర

మీ లక్షణాలు, మందులు, ఎలర్జీలు మరియు మీరు ఎదుర్కొంటున్న ఇతర ఆరోగ్య సంబంధ సమస్యలు గురించి మీరు మీ డాక్టరుకు నిర్దుష్ట సమాచారం ఇవ్వడం ముఖ్యం. మీ సమస్యను త్వరగా మరియు కరెక్టుగా రోగనిర్థారణ చేయడానికి ఇది మీ డాక్టరుకు సహాయపడుతుంది.

కుటుంబ చరిత్ర

ఆస్తమా తరచుగా వారసత్వంగా ఉంటుంది. కాబట్టి, మీ కుటుంబంలో ఎవరికైనా సమస్య ఉంటే తెలిసినట్లుగానే, మీ కుటుంబం యొక్క వైద్య చరిత్రను తెలుసుకోవడం ముఖ్యం. మీ ఫిర్యాదును మరింత లోతుగా చూడటానికి మరియు ఆస్తమాను తెలుసుకునేందుకు మిమ్మల్ని పరీక్షించాలా అనే విషయం నిర్ణయించుకునేందుకు ఇది మీ డాక్టరుకు సహాయపడుతుంది.

శారీరక పరిశీలన మరియు పరీక్షలు

అత్యధిక రోగనిర్థారణలు వైద్య చరిత్రపై ఆధారపడి ఉంటాయి కాబట్టి, సమస్యను మరియు ఇవ్వబడే చికిత్సను పూర్తిగా ఖాయం చేసుకునేందుకు, శ్వాస పరీక్షను కూడా మీ డాక్టరు సిఫారసు చేయవచ్చు.

పీక్ ఫ్లో మీటరు పరీక్ష

పీక్ ఫ్లో మీటరు అనేది చిన్న, చేతితో పట్టుకునే సాధనం, ఇది మీ ఊపిరితిత్తుల శక్తిని నిర్థారించేందుకు సహాయపడుతుంది. మీరు చేయవలసిందల్లా సాధనంలోకి గాలి ఊదడమే, మరియు మీ ఊపిరితిత్తులు ఎంత బలంగా ఉన్నాయో ఇది చూపిస్తుంది.

స్పైరోమెట్రీ పరీక్ష

మిమ్మల్ని పరీక్షించి, మీ లక్షణాలను తెలుసుకున్న తరువాత, మీకు ఆస్తమా ఉందని డాక్టరు అనుమానిస్తే, మీ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని నిర్థారించుకునేందుకు అతను/ఆమె స్పైరోమెట్రీ పరీక్ష చేయవచ్చు. మీ ఊపిరితిత్తులు ఎంత మొత్తంలో గాలిని ఉంచుకోగలదో, మరియు ఎంత బాగా గాలి ఊపిరితిత్తుల్లోకి వెళుతుంది మరియు బయటకు వస్తుంది అనే విషయం స్పైరోమీటర్ కొలుస్తుంది.ఫలితాలు విలువలుగా మరియు గ్రాఫ్ గా కనిపిస్తాయి.

మీకు ఆస్తమా ఉన్నప్పుడు దాన్ని రోగనిర్థారణ చేయడానికి మరియు పురోగతిని పర్యవేక్షించేందుకు ఉభయ పరీక్షలు సహాయపడనున్నప్పటికీ, ఇవి 6 సంవత్సరాల లోపు వయస్సు పిల్లలకు సిఫారసు చేయబడటం లేదు. కాబట్టి, మీ శిశువు యొక్క ఆస్తమాను ముందుగానే మరియు కరెక్టుగా రోగనిర్థారణ చేయబడిందని నిర్థారించుకునేందుకు, మీరు పిల్లల డాక్టరును సంప్రదిస్తుండాలి. ప్రేరేపకాలను కనుగొనడంపై శ్రద్ధపెట్టాలి, లక్షణాలను గమనించాలి మరియు చిన్న వయస్సు నుంచే ఆస్తమాను నియంత్రించడంలో మీ శిశువు పురోగతిని పర్యవేక్షించాలి.

కుడి చేతి వైపు బ్యానర్లు

 

కుడి చేతి వైపు బ్యానర్ 1 - ఆస్తమాను నేహా ఎలా జయించిందో మరియు తన తొలి 4 కి.మీ ఎలా పరిగెత్తిందో చదవండి (స్ఫూర్తిదాయక కథలు)

కుడి చేతి వైపు బ్యానర్ 2 - నాకు ఆస్తమా ఉన్నప్పటికీ నేను వ్యాయామం చేయవచ్చా లేదా ఆటలు ఆడవచ్చా? (ఎఫ్ఎక్యూ)

కుడి చేతి వైపు బ్యానర్ 3 - తమ శ్వాస సమస్యలను విజయవంతంగా అధిగమించిన ప్రజలతో కనెక్టు అయ్యేందుకు కమ్యూనిటిలో చేరండి (బ్రీత్ ఫ్రీ కమ్యూనిటి)

Please Select Your Preferred Language