ఆస్తమా

ఉబ్బసం లక్షణాలు

ఆస్తమా లక్షణాలను గుర్తించడం చాలా సులభం. ఆస్తమా యొక్క మామూలు లక్షణాలు ఇవి:

ఊపిరాడకపోవడం లేదా శ్వాస తీసుకోలేకపోవడం: మీకు మీ ఊపిరితిత్తుల నుంచి గాలి లోపలకు మరియు బయటకు తగినంత పొందలేనట్లుగా మీకు అనిపిస్తుంది, మరియు శ్వాసను బయటకు వదలడం ప్రత్యేకంగా కష్టంగా అనిపిస్తుంది.

తరచుగా లేదా వదలకుండా దగ్గు: మీకు అనేక రోజుల పాటు పోని దగ్గు కలుగుతుంది మరియు రాత్రి సమయంలో లేదా వ్యాయామం చేసిన తరువాత మీకు తరచుగా దగ్గు వస్తుంది.

పిల్లికూతలు: మీరు శ్వాస బయటకు వదిలిన ప్రతిసారి మీకు ఈల ధ్వని వినిపిస్తుంది.

ఛాతిలో బిగుతుదనం: ఎవరైనా మిమ్మల్ని మీ ఛాతిని అదిమేస్తున్నట్లుగా లేదా మీ ఛాతి మీద కూర్చుంటున్నట్లుగా ఛాతిలో బిగుతుదనం అనుభూతి మీకు కలుగుతుంది.

ఆస్తమా గల ప్రతి వ్యక్తి లక్షణాలన్నిటినీ చూపించాలని లేదు. ఉదాహరణకు, ఎక్కువ దగ్గు వల్ల రాత్రి సమయంలో కొంతమంది ప్రజలకు నిద్ర భంగం కలిగితే, మరికొంతమందికి వ్యాయామం చేసేటప్పుడు ఊపిరాడకపోవడం అనుభవించవచ్చు. మీరు లక్షణాల కోసం చూడటం ముఖ్యం, దాంతో మీ డాక్టరు మీ స్థితిని నిర్దుష్టంగా రోగనిర్థారణ చేయడానికి మీరు సహాయపడవచ్చు.

Please Select Your Preferred Language