ఆస్తమా

మీ స్థితిని అదుపుచేయుట

ఆస్తమా అనేది సమస్య, అవును. కానీ, తగిన చికిత్స మరియు ఆస్తమా కార్యాచరణ ప్రణాళికతో, మీరు మీ ఆస్తమాను పూర్తిగా నియంత్రించవచ్చు, మరియు మీకు ఇది ఉందనే విషయం మరచిపోండి. మీ ప్రేరేపకాలను నివారించండి ప్రతి ఒక్కరి ఆస్తమా భిన్నంగా ఉంటుంది, మరియు కాబట్టి వాళ్ళ ప్రేరేపకాలు కూడా భిన్నంగా ఉంటాయి. మీ సమస్యను పూర్తిగా నియంత్రించేందుకు, మీరు మీ ప్రేరేపకాలను గుర్తించడం మరియు వాటిని సాధ్యమైన మేరకు నివారించడం ముఖ్యం.

రెగ్యులర్ మందులు మీ డాక్టరు సాధారణంగా రెండు రకాల మందులు ప్రిస్క్రయిబ్ చేస్తారు- సత్వర ఉపశమనం (రిలీవర్ లేదా రెస్క్యూ) మరియు దీర్ఘకాలికం (కంట్రోలర్). సత్వర ఉపశమన మందులు వెంటనే ఉపశమనం కల్పిస్తాయి, దీర్ఘకాలిక మందులు లక్షణాలను మరియు ఎటాక్‌లను నిరోధిస్తాయి. మీ ఆస్తమాను పూర్తిగా నియంత్రణలో ఉంచేందుకు, ప్రిస్క్రయిబ్ చేసినట్లుగా మీరు ఈ మందులు తీసుకోవడం అత్యావశ్యం. రిలీవర్ మరియు కంట్రోలర్ మందులు రెండూ ఇన్హేలర్ల ద్వారా తీసుకోవాలి, ఇవి ఆస్తమాకు చికిత్స చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

పీక్ ఫ్లో మీటర్ ని ఉపయోగించుట పీక్ ఫ్లో మీటరు అనేది చిన్న సాధనం, ఇది మీ ఆస్తమాను పర్యవేక్షించడానికి మీకు సహాయపడుతుంది.

ఇది మీ ఊపిరితిత్తుల నుంచి మీరు ఎంత బాగా బయటకు గాలి ఊదుతున్నారనే విషయాన్ని లెక్కించడం ద్వారా మీ ఊపిరితిత్తుల శక్తిని కొలుస్తుంది. మీ డాక్టరు సహాయంతో, మీరు మీ ఊపిరితిత్తులకు లక్ష్యాన్ని సెట్ చేసుకోవచ్చు, మరియు మీ పురోగతిని క్రమంతప్పకుండా కొలవగలుగుతారు. మీ ఆస్తమాను నియంత్రించేందుకు పీక్ ఫ్లో మీటరును సమర్థవంతంగా ఎలా ఉపయోగించాలో తెలుసుకునేందుకు బ్రీత్ ఫ్రీ క్లినిక్ ని సందర్శించండి.

ఆస్తమా కార్యాచరణ ప్రణాళిక ఆస్తమా కార్యాచరణ ప్రణాళిక అనేది మీ ఆస్తమాను నియంత్రించేందుకు సహాయపడటం కోసం మీ డాక్టరుతో మీరు అభివృద్ధి చేసుకున్న రాతపూర్వక ప్రణాళిక. ఏ రకమైన మందులు తీసుకోవాలి మరియు వాటిని ఎప్పుడు తీసుకోవాలనే విషయం లాంటి, రోజువారి ప్రాతిపదికన మీ ఆస్తమాను ఎలా నియంత్రించాలో ఆస్తమా కార్యాచరణ ప్రణాళిక చూపిస్తుంది. మీ ఆస్తమా లక్షణాలు పెరిగితే మరియు ఆస్తమా ఎటాక్‌లలో ఏ మందులు తీసుకోవాలి మరియు స్టెప్స్ ని పాటించాలనే విషయం కూడా ప్రణాళిక మీకు తెలియజేస్తుంది. డాక్టరుకు ఎప్పుడు కాల్ చేయాలి లేదా సమీపంలోని ఆసుపత్రికి వెళ్ళాలనే విషయం ప్లాన్ వివరిస్తోంది.

రెగ్యులర్ డాక్టరు సందర్శనలు మీ లక్షణాలు నియంత్రణలో ఉన్నా లేదా లేకపోయినా దానితో నిమిత్తం లేకుండా, రోజువారి ప్రాతిపదికన మీ డాక్టరును సందర్శించడం ముఖ్యం. మీ లక్షణాలు, ఆస్తమా మందులు మరియు మీరు తీసుకుంటున్న ఇతర మందుల గురించి ఎల్లప్పుడూ మీ డాక్టరుతో మాట్లాడండి. ఈ విధంగా, మీ ఆస్తమాను నియంత్రించేందుకు, ఎటాక్ లను నిరోధించేందుకు మరియు సంపూర్ణ జీవితం జీవించడానికి మీకు సహాయపడేందుకు పనిచేసే ప్రభావవంతమైన ఆస్తమా కార్యాచరణ ప్రణాళికను మీ డాక్టరు సృష్టించగలుగుతారు.

Please Select Your Preferred Language