సిఓపిడి

సిఒపిడితో జీవించుట

సిఒపిడికి తగిన చికిత్స మరియు నిర్వహణ కావాలి. దీన్ని నియంత్రణలో ఉంచాలంటే మరియు ప్రభావవంతంగా అదుపుచేయాలంటే, మీరు మీ డాక్టరు గారి సలహాలను క్షుణ్ణంగా పాటించవలసి ఉంటుంది.

వ్యక్తి ధూమపానం మానుకొని, క్రమంతప్పకుండా మందులు తీసుకున్న తరువాత కొన్నిసార్లు సిఒపిడి యొక్క లక్షణాలు మెరుగుపడతాయి, అవి పల్మొనరి రిహాబిలిటేషన్ కి హాజరైన తరువాత మరింతగా మెరుగుపడవచ్చు. లక్షణాలు పూర్తిగా పోకపోవచ్చు, అయితే, తగిన చికిత్స మరియు జీవన విధానం మార్పులతో మీరు మీ జీవితాన్ని సంపూర్ణంగా జీవిస్తూనే ఉండొచ్చు.

క్రియాశీల జీవనవిధానం

నడవడం లేదా యోగా లాంటి కార్యకలాపాలు మీ శ్వాస వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడవచ్చు, అంటే మీరు మెరుగ్గా శ్వాసతీసుకోవచ్చని అర్థం.

సిఒపిడిని నియంత్రించడానికి నిర్దిష్ట ఆహార ఆంక్షలు లేవు, అయితే, మీ సమగ్ర ఆరోగ్యం కోసం మీరు పరిపూర్ణ ఆహారాన్ని పాటించడం ముఖ్యం. పైగా, ఆరోగ్యకరమైన ఆహారం తింటే మరియు క్రమంతప్పకుండా వ్యాయామం చేస్తే, సిఒపిడి మిమ్మల్ని మరింతగా ఇబ్బందిపెట్టడానికి కారణం లేదు.

రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్

తరచుగా, సులభంగా ఎలా శ్వాసతీసుకోవాలి, వ్యాయామం చేయాలి మరియు బాగా తినాలనే దానిపై కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా, మీ సమస్యను అదుపుచేయడంపై మీకు మార్గదర్శనం చేయడానికి పల్మొనరి లేదా ఊపిరితిత్తుల రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ సహాయపడవచ్చు.

సన్నద్ధంగా ఉండండి

మీరు ఎల్లప్పుడూ అత్యవసర సంప్రదింపు సమాచారాన్ని, మీరు దానికి ప్రాప్యత పొందే చోట అందుబాటులో ఉంచుకున్నారని నిర్ధారించుకోండి. మీ అత్యవసర నంబర్లు, మందులు మరియు మోతాదుల కాపీని రిఫ్రిజిరేటర్ మరియు మీ ఫోన్ లాంటి మీరు రెగ్యులర్ గా సందర్శించే చోట అతికించడం ఉపయోగకరంగా ఉంటుంది.

శ్వాస తీసుకోవడం కష్టంగా మారితే, వెంటనే మీ డాక్టరు వద్దకు లేదా ఆసుపత్రికి వెళ్ళండి, ఎందుకంటే ఇది అత్యవసరం కావచ్చు.

అర్థంచేసుకున్న ఇతరులతో మాట్లాడటం ఉపశమనం కావచ్చు- బ్రీత్ ఫ్రీ కమ్యూనిటిలో చేరండి మరియు తమ శ్వాస సమస్యలను జయించిన వేలాది మంది ప్రజలతో మాట్లాడండి.

Please Select Your Preferred Language