గురకకు

పిల్లికూతలు అంటే ఏమిటి? (గురించి)

పిల్లికూతలు అంటే శ్వాస తీసుకునేటప్పుడు అప్రయత్నంగానే ఈలవేసిన శబ్దం చేయడమని అర్థం. శ్వాస బయటకు వదిలేటప్పుడు ఈ శబ్దం సాధారణంగా వినిపిస్తుంది, కానీ కొన్నిసార్లు మీరు లోపలకు శ్వాస తీసుకునేటప్పుడు కూడా ఇది మీకు వినిపిస్తుంది. బ్రోంకైటిస్, సిఒపిడి లేదా ఆస్తమా లాంటి శ్వాస సమస్యకు పిల్లికూతలు సాధారణంగా సూచన అయినప్పటికీ, ఊపిరితిత్తుల్లోని పెద్ద వాయుమార్గాలు అవరోధించబడటం వల్ల కూడా, లేదా స్వర తంత్రుల్లో సమస్య ఉండటం వల్ల కూడా ఇది కలగవచ్చు.

సరైన రకం మందులతో పిల్లికూతలకు సులభంగా చికిత్స చేయవచ్చు. అత్యధిక శ్వాస సమస్యలను పూర్తిగా నియంత్రించడాన్ని మరియు చికిత్స చేయడాన్ని ఆధునిక మందు సాధ్యం చేసింది కాబట్టి, చింతించవలసిన అవసరం లేదు.