ఇన్హేలర్

ఇన్హేలర్లు ఎందుకు మెరుగైనవి

ఆస్తమా మరియు సిఒపిడి లాంటి శ్వాస సమస్యలకు చికిత్స చేయడానికి ప్రపంచవ్యాప్తంగా సిరప్ లను మరియు టాబ్లెట్లకు వ్యతిరేకంగా, ఇన్హేలర్లను అత్యంత ప్రభావవంతమైన మార్గంగా అంగీకరిస్తున్నారు.

ఊపిరితిత్తుల్లో పనిచేయవలసిన చోటుకు ఇన్హేలర్లతో మందు వాయుమార్గాన్ని నేరుగా కొన్ని సెకన్లలోనే చేరుకొని ఉపశమనం కల్పిస్తుంది. మరొకవైపు, టాబ్లెట్లు మరియు సిరప్ లను మింగవలసి ఉంటుంది. అంటే అవి ముందుగా పొట్ట మరియు రక్త ప్రవాహంలోకి చేరుకొని, ఆ తరువాత ఊపిరితిత్తులకు చేరతాయి. కాబట్టి అవి సత్వరం ఉపశమనం కల్పించవు.

పైగా, సమస్యాత్మక ప్రాంతానికి ఇన్హేలర్ మందు నేరుగా చేరుకుంటుంది కాబట్టి, తీసుకోవలసిన మోతాదు టాబ్లెట్లు మరియు సిరప్ ల కంటే గణనీయంగా తక్కువగా  ఉంటుంది.

శరీరంలోకి చాలా తక్కువ పరిమాణంలో మందు ప్రవేశిస్తుంది కాబట్టి, అనేక మంది ప్రజలు నమ్మినట్లుగా కాకుండా, ఇన్హేలర్ల వల్ల దుష్ప్రభావాలు చాలా తక్కువగా కలుగుతాయి.

కాబట్టి, మీరు లేదా మీ శిశువు చింతించకుండానే ఇన్హేలర్లను ఉపయోగించవచ్చు మరియు మీకు ఇష్టమైన మరియు ఆనందకరమైన ప్రతి ఒక్క పనిని చేస్తూనే ఉండొచ్చు.

Please Select Your Preferred Language