పెర్సిస్టెంట్ దగ్గు

దీని గురించి

దగ్గు అనేది వాయుమార్గాల్లో మరియు ఊపిరితిత్తుల్లో ఏవైనా ఇరిటెంట్లను మరియు/లేదా స్రవాలను తొలగించడానికి శరీరం ప్రయత్నించే ఒక మార్గం. అప్పుడప్పుడు దగ్గడం అర్థంచేసుకోదగినదే మరియు మామూలు విషయమే. అయితే వదలకుండా లేదా సుదీర్ఘ కాలం పాటు దగ్గడం, మరొక ఏదైనా సమస్యకు సంకేతం కావచ్చు.కాబట్టి వదలని మరియు మామూలు దగ్గుకు మధ్య గల తేడా ఏమిటి?

వదలకుండా ఉండే దగ్గు, పెద్దల్లో సాధారణంగా ఎనిమిది వారాలు మరియు పిల్లల్లో నాలుగు వారాల అంటే, నెల కంటే ఎక్కువ కాలం పాటు ఉండే దగ్గు. ధూమపానం, బ్రోంకైటిస్, ఆస్తమా, సిఒపిడి మరియు శ్వాస మార్గం ఇన్ఫెక్షన్లు వదలకుండా ఉండే దగ్గుకు కొన్నికారణాలు. అయితే, కంగారుపడవలసింది ఏమీ లేదు, సరైన రోగనిర్థారణ మరియు చికిత్సతో, దీన్ని సులభంగా అదుపుచేయవచ్చు.