ప్రేరణలు

లైమ్ లైట్ కింద కలలు

జితేష్ కి నాట్యం చేయడం అంటే ఎల్లప్పుడూ ఎంతో ఇష్టం. అతను సహజంగా బీట్ కి అతుక్కుపోతారు మరియు ప్రొఫెషనల్ మాదిరిగా గ్రూవ్ అవుతారు. కాబట్టి, ప్రొఫెషనల్ డ్యాన్సరుకు ఎదగాలనుకుంటున్నట్లుగా అతను చెప్పినప్పుడు, మా అందరికి చాలా సంతోషం అనిపించింది. అతను తన కలలను సాకారం చేసుకోవాలని మరియు ఉన్నత శిఖరాలను చేరుకోవాలని మేము అనుకుంటున్నాము.

ఒక రోజున అతను క్లాసుకు వెళ్ళడానికి నిరాకరించడంతో ఏదో తప్పు జరిగిందని మాకు తెలిసింది. అతను క్లాసుకు ఎందుకు మానుకోవాలనుకుంటున్నారో మేము అర్థంచేసుకోలేకపోయాము, మరియు అతనితో మాట్లాడటానికి ప్రయత్నించాము. కానీ అతను మాకు కారణం ఇవ్వలేదు, మరియు తాను ఇకపై డ్యాన్స్ చేయాలనుకోవడం లేదని అతను చెబుతూ ఉన్నారు. చివరగా, చాలా బుజ్జగించిన మీదట, అతను మాకు కారణం చెప్పాడు. నాట్యం చేసేటప్పుడు తనకు ఊపిరాడకపోవడం వల్ల తాను క్లాసుకు వెళ్ళాలనుకోవడం లేదని చెప్పాడు.

 

జితేష్ కలలను సాకారం చేయాలని ఇప్పటికీ కృతనిశ్చయంతో ఉన్న మేము డాక్టరు వద్దకు వెళ్ళాము. మా కలలన్నీ చెదిరిపోయే వార్త అప్పుడు డాక్టరు మాకు చెప్పారు. జితేష్ కి ఆస్తమా ఉందని చెప్పారు.

 

మొదట్లో మేము ఈ విషయం నమ్మలేకపోయాము. ఇలా ఎలా జరిగింది? అతను ఏం చేశాడు? అతనికే ఎందుకు? అనేక మంది ప్రజలు అనేక అభిప్రాయాలు చెప్పారు. వివిధ థెరపీలు. డ్యాన్స్ చేయడం సంగతి తరువాత, అతను మళ్ళీ మామూలుగా నడవగలడా లేదా పరిగెత్తగలడా అని మేము కంగారుపడ్డాము.

 

కానీ చివరగా, ఇన్హేలర్లు మమ్మల్ని ఆదుకున్నాయి. జితేష్ ఇన్హలేషన్ థెరపి ప్రారంభించారు మరియు ఆస్తమాను ప్రేరేపించే పనులు మానుకునే విషయంలో అతను చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఇన్హేలర్లు, డాక్టరు వద్దకు క్రమంతప్పకుండా వెళ్ళడం మరియు పరీక్షలు చేయించుకోవడం మరియు జితేష్ శ్రద్ధగా చేసిన
కృషి ఒకేసారి అతను తన ఆస్తమాను నియంత్రణలో ఉంచుకోవడానికి సహాయపడింది.

 

నేడు జితేష్ బాగా నాట్యం చేయడంతో సహా తనుకు ఇష్టమైన పనులు చేస్తాడు. అతనికి సమస్య ఉందనే ఎవ్వరూ అనుకోలేదు. స్కూలు వార్షిక సంఘటనలో కూడా అతను పాల్గొన్నాడు.

 

జితేష్ కి ఆస్తమా ఉందనే విషయం మేము దాదాపుగా మరచిపోయినట్లుగా ఉంది.