చొరవ

ప్రపంచ ఆస్తమా మాసం- మే 02, 2017

సమగ్ర ఆరోగ్య విషయానికొస్తే, మన శరీరాలు బాగా ఆయిల్ వేసిన యంత్రం మాదిరిగా పనిచేయాలి. అంటే మన అవయవాలన్నీ- గుండె, మెదడు, పొట్ట, మరియు మన ఊపిరితిత్తులు కూడా, సర్వోత్తమ స్థితిలో ఉండాలి. శ్వాస తీసుకోవడంలో కొద్దిగా ఇబ్బంది ఉంటే తప్ప శ్వాస తీసుకోగల మన ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేదని ఎక్కువగా అనుకుంటాము. అయితే, ఎక్కువ మంది ప్రజలు ఊపిరితిత్తులపై శ్రద్ధ పెట్టరు కాబట్టి, వారికి శ్వాస సమస్య ఉన్నట్లుగా రోగనిర్థారణ చేయబడితే (మరియు చేయబడినప్పుడు) కంగారుపడతారు. ఆస్తమా మరియు ఎలర్జీలు లాంటి శ్వాస సమస్యల గురించి మనం చింతించవలసిన పని లేదు. సరైన రోగనిర్థారణ మరియు చికిత్సతో, వీటికి చాల సులభంగా చికిత్స చేయవచ్చు మరియు అదుపుచేయవచ్చు. 
వివిధ శ్వాస సమస్యలు మరియు చికిత్సల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు, ప్రపంచ ఆస్తమా దినోత్సవం నాడు, అంటే మే 02, 2017న దేశ వ్యాప్తంగా బ్రీత్ ఫ్రీ (సిప్లా వారి ప్రజా సేవ కార్యక్రమం) శిబిరాలు నిర్వహించింది. వివిధ శ్వాస సమస్యల యొక్క ప్రాథమిక విషయాలను మరియు వాటికి చికిత్స చేసేందుకు ఇన్హేలర్లు ఎందుకు ప్రభావవంతమైన మార్గం అనే విషయం డాక్టర్లు వివరిస్తుండగా స్పైరోమీటర్లు మరియు బ్రీత్-ఓ-మీటర్ల సహాయంతో తమ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని ప్రజలు పరీక్షించుకునేందుకు ఈ శిబిరాలు ప్రజలకు సహాయపడ్డాయి. ఇన్హేలర్ల విషయంలో గల అపోహల గురించి డాక్టర్లు మాట్లాడారు మరియు శ్వాస సమస్యలకు చికిత్స చేసేందుకు ఇన్హేలర్లు అత్యంత ప్రభావవంతమైన మార్గం అనే విషయం నిరూపించేందుకు వాస్తవాలను వివరించారు.
శిబిరాలు బాగా విజయం సాధించాయి, అనేక మంది ప్రజలు శిబిరానికి హాజరై, తమకు సమీపంలోని ప్రాంతాల్లో కూడా మరిన్ని శిబిరాలను నిర్వహించవలసిందిగా బ్రీత్ ఫ్రీని అడిగారు.

FB Live Interview with Dr. Jaideep Gogtay

और पढो

#మీఊపిరితిత్తులుకాపాడుకోండిదిల్లీ

और पढो

బ్రీత్ ఫ్రీ పండుగ

और पढो