ప్రేరణలు

స్టార్స్ కి షూటింగ్

జహాన్ ఎప్పుడూ కదలకుండా కూర్చోలేడు. ఈ కారణంగా, పెద్ద మరియు చిన్న గాయాలు కలగడం ఇంట్లో వారంవారీ సంఘటనగా మారింది. అంతే కాదు అతను కోరుకున్న దేనినీ చేయకుండా అవి అతన్ని ఎప్పుడూ ఆపలేదు. నేను అంగీకరిస్తాను, నేను కొద్దిగా భయపడ్డాను, కానీ ప్రతి తల్లిదండ్రి వాళ్ళ శిశువు గురించి భయపడిన విధంగా. నా మృత్యభయం నిరంతరం రోజూ భయంకరంగా మారుతుదని నాకు తెలియదు.

 

జహాన్ కి 4 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు అతను ఇంటికి పూర్తిగా ఊపిరాడని స్థితిలో తిరిగొచ్చాడు. అతను అప్పుడే మెట్ల పైకి పరిగెత్తాడని భావించి, దాని గురించి మేము పెద్దగా ఆలోచించలేదు. అతను శ్వాస తీసుకోవడం మామూలు స్థితికి రాకపోవడంతో ఏదో తప్పు జరిగిందని మేము గ్రహించాము. పూర్తిగా భయపడిన స్థితిలో, మేము చేయగలిగిన పని మాత్రమే చేశాము; మేము అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళాము.

 

మేము డాక్టరుకు వివరించడానికి ముందే, జహాన్ ని ముక్కు మరియు నోటికి ఆక్సిజెన్ మాస్కుతో ఐసియులోకి తీసుకెళ్ళారు. మేము అనుభవించిన భయాన్ని వివరించడానికి మా వద్ద మాటలు లేవు. మేము అతన్ని కోల్పోవడం ఖాయమని నాకు అనిపించింది.

 

కొద్ది గంటల తరువాత, ఉపశమనం మరియు కొత్త భయాన్ని మాకు తీసుకొచ్చిన వార్తను డాక్టరు మాకు చెప్పారు. జహాన్ కి ఎలాంటి ప్రమాదం లేదు. కానీ, అతనికి ఆస్తమా ఉంది. ఆస్తమా గురించి మాకు గల భయం మరియు పరిమిత పరిజ్ఞానంతో, మేము డాక్టరుపై ప్రశ్నలు సంధించాము. ‘‘అతను మళ్ళీ మామూలుగా ఉంటాడా?’’ ‘అతనికే ఎందుకు’ ‘అతని ఆస్తమాను నయం చేసేందుకు ఏదైనా మార్గం ఉందా?’ ‘అతను ఫుట్ బాల్ ని కొనసాగించవచ్చా?’ ‘ఆస్తమా పొందడానికి అతను చాలా చిన్నవాడు కాదా?’

అప్పుడు డాక్టరు ఆస్తమా గురించి ప్రతి ఒక్క విషయం మరియు జహాన్  తీసుకోవడానికి ఇన్హేలర్లు ఎలా ఉత్తమమైనవో వివరించారు. ఇన్హేలర్లు ఎలా ప్రయోజనకరమైనవో మాకు అర్థంకాలేదు. మేము మళ్ళీ ప్రశ్నలు అడగటం ప్రారంభించాము. ‘అతనికి ఇన్హేలర్లు ఎందుకు అవసరం?’, ఇది ఎదిగిన పిల్లలకు మాత్రమే ఉండాల్సిందే కదా? ‘చికిత్సకు ఇది చివరి ప్రయత్నమా?’ ‘ఇన్హేలర్లలో స్టీరాయిడ్లు ఉండవా?’ ‘జహాన్  ఎదుగుదలను స్టీరాయిడ్లు గిడసబారనివ్వవా?’

 

ఇన్హేలర్లను చుట్టుముట్టుతున్న కల్పితాలు, మరియు ప్రజలు మెరుగ్గా శ్వాస తీసుకోవడానికి వాయుమార్గాలను తెరవడానికి అవి ఎలా సహాయపడ్డాయి అనే విషయం గురించి డాక్టరు వివరించారు. మాకు ఇప్పటికీ కొద్దిగా ఇన్హేలర్ల గురించి ఖచ్చితంగా తెలియదు, కానీ జహాన్ కి సహాయపడేందుకు ఇది ఉత్తమ మార్గం అనే విషయం అంగీకరించారు. మరియు ఇన్హేలర్లను కరెక్టుగా ఎలా ఉపయోగించాలనే విషయం గురించి మేము తెలుసుకొని, జహాన్ కి బోధించాము.

 

కానీ ఇన్హలేషన్ థెరపితో కూడా, మేము అతని విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాము. అతను తినే మరియు తాగే ప్రతి దానిని మేము నిశితంగా గమనిస్తున్నాము. దేనికోసమైనా ఇంటి నుంచి జహాన్ వెళ్ళడం మమ్మల్ని భయపెడుతోంది, మరియు అతను ఏదైనా క్రీడ ఆడతాడనేది పూర్తిగా ప్రశ్నార్థకమే. మేము అతన్ని సాధ్యమైనంత మేరకు మాకు చేరువగా ఉంచాలని అనుకుంటున్నాము, దీనివల్ల అతనికి ఏదీ జరగకుండా ఉంటుంది.

 

నెమ్మదిగా, మేము ఇన్హలేషన్ థెరపి ప్రభావాలను గమనించడం ప్రారంభించాము. అతనికి శ్వాస మెరుగుపడటం, మరియు అతనిలో ఆత్మవిశ్వాసం తిరిగి రావడం మేము చూశాము. ఆస్తమాను ప్రేరేపించేవాటిని నివారించడం మరియు ఇన్హేలర్లను సరిగ్గా ఉపయోగించడంతో పాటు క్రమంతప్పకుండా డాక్టరు వద్దకు వెళ్ళడం ద్వారా జహాన్ తన ఆస్తమాను నియంత్రణలో ఉంచుకున్నారు.

 

12 సంవత్సరాల వయస్సు వాడైన జహాన్ ఇప్పుడు చాలా క్రియాశీలమైన మరియు ఆరోగ్యకరమైన అబ్బాయిగా ఉన్నాడు. అతను సర్వోత్తమ ఈతగాడు మరియు ఫుట్ బాల్  ఆటగాడు. అతను తనకు ఇష్టమైన ప్రతి ఒక్కటీ తింటున్నారు, మరియు తన వయస్సులో మంచి అద్భుతమైన వంటగాడుగా మారుతున్నాడు. జహాన్ ని చూసిన ఎవ్వరూ అతనికి ఆస్తమా ఉందంటే నమ్మరు, మరియు నిజాయితీగా చెప్పాలంటే కొన్నిసార్లు మేము కూడా!

Please Select Your Preferred Language