#మీఊపిరితిత్తులుకాపాడుకోండిదిల్లీ

ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్టు ప్రకారం, ప్రపంచంలోని 13 అత్యంత కాలుష్య నగరాలు భారతదేశంలో ఉన్నాయి, దీనిలో దేశ రాజధాని నగరం న్యూఢిల్లీ కూడా ఉంది. ఎక్స్ పోజరు పరిమాణం పెరుగుతుండటంతో మనం పర్యావరణంలోని ఎలర్జెన్స్ ని మరియు కాలుష్యాలను ఎదుర్కొంటాము, ఇది ఢిల్లీ జనాభాలో దాదాపు 34% మంది ఆస్తమా, సిఒపిడి మరియు బ్రోంకైటిస్ లాంటి వివిధ శ్వాస సమస్యలకు గురవుతున్నారనడంలో నిజానికి ఎలాంటి ఆశ్చర్యం లేదు. వాటిని కలిగి ఉన్న వ్యక్తుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, శ్వాస సమస్యలు, మరియు ఎలర్జెన్స్ మరియు కాలుష్యాలు మనిషి ఊపిరితిత్తులను ఎలా ప్రభావితం చేస్తాయనే విషయం గురించి అవగాహన చాలా తక్కువగా ఉంది.

శ్వాస సమస్యల రకాలు మరియు వాటి చికిత్సను ప్రజలు అర్థంచేసుకోవలసిన మరియు తెలుసుకోవలసిన అవసరం పెరుగుతోందనే విషయం బ్రీత్ ఫ్రీ (సిప్లా వారి ప్రజా సేవ కార్యక్రమం) అర్థంచేసుకుంది. కాబట్టి, మీకు అవసరమైన సమాచారం మరియు మద్దతు మొత్తాన్ని పొందడానికి మీకు సహాయపడేందుకు మేము ‘#మీ ఊపిరితిత్తులనుకాపాడుకోండిదిల్లీ’ అనే కదలికను మేము ప్రారంభించాము. ఈ కదలికతో పాటు, బ్రీత్ ఫ్రీ తన మొట్టమొదటి, రకమైన హెల్ప్ లైన్ ని కూడా ప్రారంభించింది, ఇది రేయింబవళ్ళు మీకు ఉచిత మద్దతు మరియు సమాచారం ఇస్తుంది.

మీకు శ్వాస సమస్య ఉంటే లేదా ఇది ఉన్న ఎవరైనా మీకు తెలిస్తే లేదా మీకు ఉందనే విషయం ఆలోచించినా, మీరు సింపుల్ గా హెల్ప్ లైన్ కి కాల్ చేయండి మరియు మీ పొరుగున ఉచిత ఊపిరితిత్తుల పరీక్ష శిబిరాన్ని నిర్వహించవలసిందిగా బ్రీత్ ఫ్రీని అడగండి.

కాబట్టి, #మీ ఊపిరితిత్తులనుకాపాడుకోండిదిల్లీ మరియు స్వేచ్ఛగా శ్వాస తీసుకునే సమయం ఆసన్నమైంది.